Viswambhara: విశ్వంభర భలే రిలీజ్ డేట్ పట్టేశారుగా

మెగాస్టార్ చిరంజీవి(chiranjeevi)హీరోగా యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ వశిష్ట(Vassishta) దర్శకత్వంలో రానున్న సినిమా విశ్వంభర(viswambhara). సోషియో ఫాంటసీ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై మొదట్లో చాలానే అంచనాలున్నాయి. కానీ వీఎఫ్ఎక్స్ వల్ల ఈ సినిమాపై అనవసరమైన నెగిటివిటీ వచ్చింది. వాస్తవానికి విశ్వంభర ఈ పాటికే రిలీజై ఉండాల్సింది.
కానీ షూటింగ్ లేటవడం, వీఎఫ్ఎక్స్ వల్ల మూవీ వాయిదాల మీద వాయిదాలు పడుతూ వచ్చింది. అయితే రీసెంట్ గా చిరూ బర్త్ డే సందర్భంగా వచ్చిన వీడియోలో విశ్వంభరను కచ్ఛితంగా నెక్ట్స్ ఇయర్ సమ్మర్ కు రిలీజ్ చేస్తానని చిరంజీవి మాటిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే విశ్వంభరను చిరూ మాట ప్రకారం నెక్ట్స్ ఇయర్ ఏప్రిల్ 30న రిలీజ్ చేయాలని చూస్తున్నారట మేకర్స్.
ఏప్రిల్ 30న తమ సినిమాను రిలీజ్ చేస్తే పిల్లలకు సెలవుల కారణంగా అందరూ విశ్వంభరను చూసే అవకాశముంటుందని నిర్మాతలు ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. త్రిష(trisha), ఆషికా రంగనాథ్(Aashika Ranganath) హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు కీరవాణి(keeravani) సంగీతం అందిస్తుండగా యువి క్రియేషన్స్(UV Creations) సంస్థ భారీ బడ్జెట్ తో విశ్వంభరను నిర్మిస్తోంది.