Hari Hara Veera Mallu: వీరమల్లులో నెక్ట్స్ లెవెల్ విజువల్స్

పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ఎప్పుడో కరోనాకు ముందు మొదలుపెట్టిన సినిమా హరి హర వీరమల్లు(Hari Hara Veera Mallu). క్రిష్ జాగర్లమూడి(Krish Jagarlamudi) దర్శకత్వంలో కొంత మేర షూటింగ్ పూర్తి చేసుకున్న తర్వాత ఈ సినిమా ఆగిపోయింది. ఆ తర్వాత అసలు మొదలవుతుందా లేదా అని కూడా అనుకున్నారు. పవన్ ఈ సినిమాకు కాకుండా మిగిలిన సినిమాలకు డేట్స్ ఇస్తుండటంతో ఇదే అనుమానంతో క్రిష్ వీరమల్లు నుంచి తప్పుకున్నాడు.
దీంతో దర్శకత్వ బాధ్యతల్ని ఏఎం జ్యోతి కృష్ణ(AM Jyothi Krishna) తీసుకుని రీసెంట్ గానే వీరమల్లు షూటింగ్ ను పూర్తి చేశాడు. అన్నీ అనుకున్నట్టు జరిగితే జూన్ 12న వీరమల్లు ప్రేక్షకుల ముందుకు వచ్చేది. కానీ సీజీ వర్క్స్ పెండింగ్ ఉండటం వల్ల వీరమల్లు మరోసారి వాయిదా పడింది. దీంతో ఈ సినిమా మళ్లీ ఎప్పుడు రిలీజవుతుందనే విషయంలో మెగా ఫ్యాన్స్ ఆతృతగా ఉన్నారు.
హిస్టారికల్ సినిమా కావడంతో వీరమల్లుకు భారీ వీఎఫ్ఎక్స్ అవసరమయ్యాయి. ఆ కారణంగానే సినిమా ఆలస్యమవుతూ వచ్చింది. అయితే ఇన్నాళ్ల పాటూ ఈ మూవీకి వర్క్ చేసిన వీఎఫ్ఎక్స్ టీమ్ ఇప్పుడు సినిమాను పూర్తి చేసినట్టు తెలుస్తోంది. దాదాపు రెండేళ్ల పాటూ కష్టపడి పనిచేసిన అల్‌జరాహ్ స్టూడియోస్(Alzarah Studios) వీరమల్లుకు నెక్ట్స్ లెవెల్ విజువల్స్ ను అందించినట్టు చిత్ర యూనిట్ చాలా నమ్మకంగా చెప్తోంది. వీరమల్లు సినిమా విజువల్ ఎఫెక్ట్స్ పరంగా నెవర్ బిఫోర్ అనేలా ఉంటుందని చెప్తున్నారు. నిధి అగర్వాల్(Niddhi Agerwal) హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో బాబీ డియోల్(Bobby Deol) విలన్ గా కనిపించనున్నాడు.