Viswambhara: విశ్వంభర మ్యూజిక్‌పై అంచనాలు పెంచిన డైరెక్టర్
చిరంజీవి(Chiranjeevi) హీరోగా యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ వశిష్ట(vassista)తో చేస్తున్న భారీ బడ్జెట్ సినిమా విశ్వంభర(Viswambhara). పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ చాలా వేగంగా జరుగుతుంది. సోషియో ఫాంటసీ మూవీగా వస్తోన్న ఈ సినిమాకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ను డైరెక్టర్ షేర్ చేశాడు.
విశ్వంభర మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయని ఈ సందర్భంగా వశిష్ట తెలిపాడు. కీరవాణి(keeravani), చిరంజీవి, చంద్రబోస్(Chandrabose) తో కలిసి దిగిన ఫోటోను షేర్ చేస్తూ విశ్వంభరకు మంచి మ్యూజిక్ ను అందించిన కీరవాణికి థ్యాంక్స్ చెప్పాడు. ఆడియన్స్ ఈ మ్యూజిక్ ను ఎంతో ఇష్టపడతారని, సినిమా రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నట్టు వశిష్ట తెలిపాడు.
అయితే ఈ సినిమా కోసం కీరవాణి చాలా జాగ్రత్తలు తీసుకుని మరీ మ్యూజిక్ ను అందిస్తున్నట్లు తెలుస్తోంది. వీఎఫ్ఎక్స్ కు ఎక్కువ ప్రాధాన్యత గల విశ్వంభరకు దానికి తగ్గ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇవ్వాలని కీరవాణి ప్రయత్నిస్తున్నాడట. త్రిష(trisha) హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో ఆషికా రంగనాథ్(Ashika Ranganadh), కునాల్ కపూర్(Kunal Kapoor), ఈషా చావ్లా(esha Chawla) కీలక పాత్రల్లో నటిస్తున్నారు.













