Vishal: విశాల్ బాడీకీ 119 కుట్లు.. రీజన్ అదే

తమిళ హీరో అయినప్పటికీ విశాల్(Vishal) కు తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉంది. ఎన్నో సినిమాల్లో నటించి స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న విశాల్ కు యాక్షన్ హీరో అనే పేరుంది. దానిక్కారణం విశాల్ సినిమాల్లో ఎలాంటి డూప్స్ లేకుండా, అన్నీ తానే స్వయంగా చేయడం. సాధారణంగా హీరోలందరూ యాక్షన్ సీన్స్ కోసం డూప్స్ వాడటం కామన్.
ఏదో చిన్న చిన్న ఫైట్స్ అయితే వాళ్లే మేనేజ్ చేస్తారు తప్పించి పెద్ద సీక్వెన్స్ చేయాలంటే మాత్రం డూప్ తప్పనిసరి. కానీ విశాల్ మాత్రం అలా కాదు. ఎంతటి పెద్ద యాక్షన్ సీక్వెన్స్ అయినా, భారీ స్టంట్ అయినా, రిస్క్ తీసుకుని దాన్ని కంప్లీట్ చేస్తారు. అందుకే విశాల్ శరీరానికి ఏకంగా 119 కుట్లు పడ్డాయట. మూవీస్ లో డూప్స్ లేకుండా చేయడం వల్లే తనకు అన్ని కుట్లు పడ్డాయని విశాల్ వెల్లడించాడు.
త్వరలోనే యువర్స్ ఫ్రాంక్లీ విశాల్(Yours Frankly Vishal) పేరుతో ఓ పాడ్‌కాస్ట్ ను ప్రారంభించనున్న విశాల్, తాజాగా దానికి సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేయగా, ఆ ప్రోమోలో ఈ విషయాన్ని బయటపెట్టాడు. విషయం తెలుసుకున్న ఆడియన్స్ విశాల్ లాంటి నటులు చాలా అరుదుగా ఉంటారని కామెంట్స్ చేస్తూ ఆయన్ని ప్రశంసిస్తున్నారు. రీసెంట్ గా ఇండస్ట్రీలోకి వచ్చి 21 ఏళ్లు పూర్తి చేసుకున్న విశాల్, త్వరలోనే నటి సాయి ధన్సిక(sai dhansika)ను పెళ్లాడనున్న సంగతి తెలిసిందే.