Vikram: 96 డైరెక్టర్ తో విక్రమ్ మూవీ ఫిక్సైందా?

96, సత్యం సుందరం(satyam sundaram) సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ క్లాసిక్ సినిమాలను ఇండియన్ సినిమాకు అందించిన డైరెక్టర్ ప్రేమ్ కుమార్(Prem Kumar) ఆడియన్స్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇండస్ట్రీలో ఎంతోమంది డైరెక్టర్లుండగా ప్రేమ్ కుమార్ లాంటి చాలా తక్కువ మంది మాత్రమే మనసుల్ని హత్తుకునే సినిమాలు చేయగలరు. ఈ నేపథ్యంలోనే ఆయన్నుంచి తర్వాతి సినిమా ఎప్పుడెప్పుడొస్తుందా అని అందరూ ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
సత్యం సుందరం వచ్చి ఏడాదవుతున్నా ప్రేమ్ కుమార్ తన తర్వాతి సినిమాను అనౌన్స్ చేయలేదు. ఈ నేపథ్యంలోనే ఆయన నెక్ట్స్ ప్రాజెక్టు గురించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ వినిపిస్తోంది. ప్రేమ్ కుమార్ తాజాగా కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్(Chiyaan Vikram) కు ఓ కథ చెప్పి సినిమాను లాక్ చేసుకున్నారని, ప్రేమ్ కుమార్ చెప్పిన కథ విక్రమ్ ను ఎంతగానో ఇంప్రెస్ చేసిందని అంటున్నారు.
అయితే ప్రేమ్ కుమార్ ముందు తన తర్వాతి సినిమాగా 96 కు సీక్వెల్ చేద్దమానుకున్నారు కానీ ఇప్పుడు మళ్లీ మనసు మార్చుకుని కొత్త ప్రాజెక్టును తెరకెక్కించనున్నారని తెలుస్తోంది. యాక్షన్ సెంట్రిక్ సినిమాగా తెరకెక్కనున్న ఈ సినిమా అనుకున్నది అనుకున్నట్టు జరిగితే వచ్చే ఏడాది స్టార్టింగ్ లో సినిమా మొదలవుతుంది. వేల్స్ ఇంటర్నేషనల్(Vels international) ఈ సినిమాను నిర్మించనున్నట్టు సమాచారం.