సరిలేరు నీకెవ్వరూ లో విజయశాంతి ఫస్ట్‌లుక్
సుదీర్ఘ విరామం తరువాత విజయశాంతి నటిస్తున్న చిత్రం సరిలేరు నీకెవ్వరు. మహేష్‌బాబు కథానాయకుడు. అనిల్ రావిపూడి దర్శకుడు. శ్రీ వెంకటేశ్వర ప్రొడక్షన్స్, జీఎమ్బీ ఎంటర్టైన్మెంట్స్, ఏకే ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి. దీపావళి సందర్బంగా విజయశాంతి లుక్‌ని చిత్రబృందం విడుదల చేసింది. ఆమె ఈ చిత్రంలో ప్రొఫెసర్ భారతిగా కనిపించనున్నారు. మేజర్ అజయ్ కృష్ణగా మహేష్ నటిస్తున్న సంగతి తెలిసిందే. జనవరి 12న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. రష్మిక కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.













