భారీగా జరుగుతున్న ఖుషి బిజినెస్
రౌడీ హీరో విజయ్ దేవరకొండ, టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ఖుషి. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. సెప్టెంబర్ 1న ఖుషి అన్ని భాషల్లోనూ రిలీజ్ కాబోతుంది. మొదట్లో ఈ సినిమాకు పవన్ కళ్యాణ్ క్లాసిక్ మూవీ టైటిల్ వాడుకున్నారని నెగిటివిటీ వచ్చిప్పటికీ రిలీజ్ దగ్గర పడుతున్న టైమ్ కు బజ్ బాగా పెరుగుతోంది.
రీసెంట్గా జరిగిన మ్యూజికల్ క్యాన్సర్ట్ వల్ల ఈ బజ్ ఇంకా ఎక్కువైపోయింది. ఈ కాన్సర్ట్ లో సమంత, విజయ్ కలిసి స్టేజ్ పై లైవ్ లో డ్యాన్స్ చేయడం జనాల్లోకి బాగా వెళ్లింది. హీరోహీరోయిన్ల ట్రాక్ రికార్డ్ తో సంబంధం లేకుండా ఖుషి బిజినెస్ చాలా భారీగా జరుగుతుందని ట్రేడ్ వర్గాల సమాచారం. కేవలం థియేట్రికల్ రైట్స్నే రూ.60 కోట్లకు అమ్మినట్లు వార్తలొస్తున్నాయి.
ఒక రొమాంటిక్ ఎమోషనల్ ఎంటర్టైనర్ కు ఇంత మొత్తంలో రేట్ అంటే ఆశ్చర్యమే. దీనికి ముందు విజయ్ చేసిన సినిమా లైగర్ రూ.90 కోట్లకు అమ్ముడుపోయింది కానీ దాని బిజినెస్ వేరు. ఇస్మార్ట్ శంకర్ తర్వాత పూరీ చేస్తున్న సినిమా కావడం, దానికి తోడు క్రేజీ కాంబో అవడంతో అసలు రేట్ గురించి డిస్ట్రిబ్యూటర్లు ఆలోచించలేదు. కానీ ఇప్పుడలా కాదు.
ఖుషి సినిమా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అవుతున్నప్పటికీ అన్ని భాషల్లో భారీ క్రేజ్ అయితే లేదు. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవాలంటే కనీసం రూ.90 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తేనే అది సాధ్యమవుతుంది. మంచి టాక్ వస్తే అదేమీ అసాధ్యం కాదు కానీ టాక్ తేడా వస్తేనే కొంచెం కష్టం. డిస్ట్రిబ్యూషన్ పరంగా మైత్రీ ఇప్పటికే చాలా గ్రాండ్ రిలీజ్ ని ప్లాన్ చేసింది. సింగిల్ రిలీజ్ కాబట్టి థియేటర్ల ఇబ్బంది కూడా ఉండదు. ఇప్పటికే మ్యూజిక్ ప్రేక్షకుల్లోకి బాగా వెళ్లిపోయింది కాబట్టి సినిమాలో కంటెంట్ బాగుండి, విజయ్-సమంత కెమిస్ట్రీ వర్కవుట్ అయితే ఎప్పటినుంచో సమంత ఎదురుచూస్తున్న హిట్ తన ఖాతాలో పడినట్లే.













