Mega157: మెగా157లో వెంకీ గెస్ట్ రోల్
సంక్రాంతికి వస్తున్నాం(Sankranthiki Vasthunnam)తో సూపర్‌హిట్ అందుకున్న అనిల్ రావిపూడి(Anil Ravipudi) తన నెక్ట్స్ మూవీని చిరంజీవి (Chiranjeevi)తో చేయనున్న సంగతి తెలిసిందే. మొన్న ఉగాది సందర్భంగా పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ఆల్రెడీ పూర్తి చేసుకుని ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటుంది. ఈ మూవీలో చిరంజీవి శంకర్ వరప్రసాద్ పాత్రలో కనిపించనున్నాడన్న విషయం తెలిసిందే.
చిరూ కెరీర్లో 157వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ మూవీ కోసం అనిల్ భారీ ప్లానే వేసినట్టు తెలుస్తోంది. మెగా157(Mega157) కోసం అనిల్ ఎన్నో ఎట్రాక్షన్స్ ను సినిమాలో చూపించనున్నట్టు తెలుస్తోంది. చాలా కాలం తర్వాత చిరూతో ఈ సినిమాలో ఓ పాట పాడించనున్న అనిల్, దాంతో పాటూ ఈ మూవీలో వెంకటేష్ తో ఓ గెస్ట్ రోల్ చేయించనున్నాడట. వాస్తవానికి వెంకీది ఈ మూవీలో గెస్ట్ రోల్ కూడా కాదట.
అతని పాత్ర కోసం అనిల్ రావిపూడి స్పెషల్ గా ఓ ఫైట్, సాంగ్ కూడా డిజైన్ చేశాడని టాక్. చిరూ, వెంకీ కలిసి ఒక సాంగ్ లో డ్యాన్సులేయనున్నారని, ఆ పాటకు ఫ్యాన్స్ కు పూనకాలు రావడం గ్యారెంటీ అని టాక్ వినిపిస్తుంది. భీమ్స్ సిసిరోలియో(Bheems Ciciroleo) సంగీతం అందిస్తున్న ఈ సినిమాను సాహు గారపాటి(Sahu Garapati)తో కలిసి చిరంజీవి కూతురు సుస్మిత కొణిదెల(Sushmita Konidela) నిర్మిస్తోంది. నెక్ట్స్ ఇయర్ సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.













