వైరల్ అవుతున్న వశిష్ఠ సోషల్ మీడియా పోస్టు
మెగాస్టార్ చిరంజీవి(chiranjeevi) నటిస్తున్న విశ్వంభర(vishwambhara) రిలీజ్ విషయంలో మరోసారి ఇంట్రెస్టింగ్ డిస్కషన్ మొదలైంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సోషియో ఫాంటసీ సినిమాకు వీఎఫ్ఎక్స్ వర్క్స్ ప్రధాన కారణంగా ఆలస్యం కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు మేకర్స్ నుంచి రిలీజ్ డేట్ పై అఫీషియల్ అనౌన్స్మెంట్ రాకపోయినా, జనవరి 9న సినిమాను థియేటర్లలోకి తీసుకురావాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయనే ప్రచారం వినిపిస్తోంది. దీంతో మెగా ఫ్యాన్స్ లో అంచనాలతో పాటు సందేహాలు కూడా పెరుగుతున్నాయి.
ఇదే టైమ్ లో డైరెక్టర్ వశిష్ఠ(Vassista) చేసిన ఓ ఎమోషనల్ సోషల్ మీడియా పోస్ట్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. మనం ఎన్ని ప్లాన్స్ వేసుకున్నా చివరికి దైవ నిర్ణయమే జరుగుతుందనే భావనను ఆయన తన పోస్ట్ ద్వారా వ్యక్తం చేసినట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా రిలీజ్ డేట్ పై క్లారిటీ కోసం వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ కు ఈ పోస్ట్ మరింత ఆసక్తిని కలిగించింది. సినిమా రిలీజ్ విషయంలో సిట్యుయేషన్స్ ఇంకా పూర్తిగా తమ కంట్రోల్ లో లేవా అనే డిస్కషన్ కూడా మొదలైంది.
జనవరి 9 రిలీజ్ కు సంబంధించి ఓటీటీ వారి వైపు నుంచి కూడా ఆసక్తి ఉందనే ప్రచారం సాగుతోంది. యూవీ క్రియేషన్స్(UV Creations) భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ సినిమాకు ఎంఎం కీరవాణి(MM Keeravani) సంగీతం అందించగా, హరి గౌర(Hari Gowra) బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌పై పనిచేశారు. వీఎఫ్ఎక్స్ వర్క్స్ పూర్తయ్యే తీరును బట్టి రిలీజ్ పై ఫైనల్ డెసిషన్ తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.








