వరుణ్ ధావన్ పెళ్లి ముహుర్తం ఖరారు!
పది రోజుల క్రితమే బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ తన వివాహం గురించి స్పందించారు. అన్ని బాగుంటే ఈ ఏడాదిలోనే పెళ్లి చేసుకుంటాను అని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సడెన్‌గా ఈ నెల 24న పెళ్లి ముహుర్తం ఖరారయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వరుణ్ కుటుంబానికి అత్యంత సన్నిహితుల ద్వారా తెలిసింది ఏంటంటే.. ఈ నెల 24న అలీబాగ్‌లో వరుణ్ ధావన్ వివాహం జరగనుంది. హిందూ సంప్రదాయం ప్రకారం జరిగే ఈ పెళ్లి వేడుకకి కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరు కానున్నారు. ఇక ఈ నెల 22 నుంచి ప్రీ వెడ్డింగ్ కార్యక్రమాలు ప్రారంభమవుతాయి అని తెలిసింది. ఇక పెళ్లి కుమార్తె ఎవరనుకుంటున్నారా.. ఇంకెవరు వరుణ్ లాంగ్ టైమ్ గర్ల్ ఫ్రెండ్, ఫ్యాషన్ డిజైనర్ నటాశా దలాలే.













