‘ఉండిపోరాదే’ ట్రైలర్ విడుదల
ఐదేళ్లుగా చిన్న చిత్రాల విజయాల శాతం ఎక్కువగా ఉంది. కథను నమ్మి నిజాయతీగా చిత్రాన్ని తీస్తే ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ సినిమా ట్రైలర్, పాటలు చూశా. సాంకేతికంగా బావున్నాయి అని నిర్మాత రాజ్ కందుకూరి అన్నారు. తరుణ్ తేజ్, లావణ్య జంటగా నవీన్ నాయని దర్శకత్వంలో డా.లింగేశ్వర్ నిర్మించిన ఉండిపోరాదే ట్రైలర్ను ఆయన విడుదల చేశారు. కథపై నమ్మకంతో సొంతంగా విడుదల చేయాలనుకుంటున్నా. కుటుంబ సభ్యుల బంధాలు మన జీవితంపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయనే కథాంశంతో సినిమా రూపొందింది అని లింగేశ్వర్ అన్నారు. ఈ కార్యక్రమంలో చిత్రబృందం పాల్గొంది.













