Trivikram: రవితేజను కాపాడలేకపోయిన త్రివిక్రమ్
ఏ సినిమా సక్సెస్ లో అయినా కీలక పాత్ర పోషించేది కథనే. కథ సరిగా లేకపోవడం వల్ల ఎన్నో సినిమాలు డిజాస్టర్లుగా మిగిలితే, కథ బావుండటం వల్ల చాలా సినిమాలు బ్లాక్ బస్టర్లు అయ్యాయి. అందుకే దర్శకనిర్మాతలు, హీరోలు కథల విషయంలో ఎంతో ఆచితూచి అడుగులేస్తుంటారు. ఇక అసలు విషయానికొస్తే రవితేజ(raviteja) హీరోగా రీసెంట్ గా వచ్చిన మాస్ జాతర(mass jathara) మూవీ డిజాస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే.
సితార ఎంటర్టైన్మెంట్స్(sithara entertainments) బ్యానర్ లో వచ్చిన ఈ మూవీకి ఫస్ట్ షో నుంచే నెగిటివ్ రివ్యూలు వచ్చాయి. సితార బ్యానర్ అంటే అందులో వచ్చే ప్రతీ సినిమాలకూ డైరెక్ట్‌గానో, ఇన్‌డైరెక్ట్ గానో త్రివిక్రమ్(trivikram) సపోర్ట్ ఉంటుంది. ఆ బ్యానర్ లో వచ్చే ప్రతీ సినిమా కథనీ త్రివిక్రమ్ వింటారు. కథ వినడమే కాకుండా అవసరమైతే దానికి సలహాలు, సూచనలు కూడా ఇస్తుంటారు త్రివిక్రమ్.
మాస్ జాతరకు కూడా త్రివిక్రమ్ అలానే కొన్ని సూచనలు ఇచ్చారట. ఆ సినిమాలో సముద్రఖని పాత్రను జోడించడంతో పాటూ, ఓ కామెడీ ట్రాక్ ను పెట్టమని కూడా త్రివిక్రమ్ డైరెక్టర్ కు సూచించారని సమాచారం. ఆడియన్స్ ను మెప్పించడానికి త్రివిక్రమ్ ఈ మార్పులు సూచించడం బావున్నప్పటికీ సినిమాలో అసలు కథ లేనప్పుడు ఎన్ని సీన్స్ జోడించి ఏం ఉపయోగమని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.







