Trisha: త్రిషకు నాలుగోసారి బాంబు బెదిరింపులు
తమిళనాడులోని చెన్నైలో ప్రముఖులను టార్గెట్ గా చేసుకుని వారిని గుర్తు తెలియని వ్యక్తులు బెదిరిస్తున్నారు. ఈ మధ్య చెన్నైలో ఈ బాంబు బెదిరింపులు ఎక్కువయ్యాయి. తాజాగా ప్రముఖ హీరోయిన్ త్రిష ఇంటికి బాంబు బెదిరింపు వచ్చింది. చెన్నైలోని ఆల్వార్పేట్(Alwarpet) లో ఉన్న త్రిష(Trisha) ఇంట్లో ఓ పరికరం అమర్చబడిందని ఓ ఆగంతుకుడు ఈమెయిల్ ద్వారా సమాచారాన్ని పంపాడు.
దీంతో పోలీసులు వెంటనే బాంబ్ డిస్పోజల్ స్వ్కాడ్, డాగ్ స్వ్కాడ్ తో త్రిష ఇంటికి చేరుకుని, ఆ ఇంటి పరిసరాలు మొత్తాన్ని పరిశీలించి, కొన్ని గంటల పాటూ వెతికిన తర్వాత అక్కడ ఎలాంటి పేలుడు పదార్థాలు కానీ, అనుమానస్పద వస్తువులు కానీ లేవని తేల్చారు. ఇదంతా ఆకతాయిల పనేనని పోలీసులు తేల్చడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
అయితే త్రిష ఇంటికి ఇలాంటి బెదిరింపులు రావడం ఇదే ఫస్ట్ కాదు. గతంలో కూడా త్రిషకు బాంబు బెదిరింపులు రాగా, ఇది నాలుగోసారి. కాగా తేనాంపేట(tenamepta) పోలీసులు ఈ విషయంలో కేసు నమోదు చేసి, మెయిల్ పంపిన వారిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. త్రిషకు నాలుగుసార్లు బాంబు బెదిరింపులు రావడంతో పోలీసులు త్రిష భద్రతలను చాలా సీరియస్ గా తీసుకున్నారు.







