బన్నీ కోసం కొత్తగా ట్రై చేస్తున్న త్రివిక్రమ్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప2 సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. 300 కోట్ల భారీ బడ్జెట్తో మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. పుష్ప1 బాగా సక్సెస్ కావడంతో ఈ సినిమాకు బాగా క్రేజ్ నెలకొంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన వేర్ ఈజ్ పుష్ప వీడియోకు విపరీతమైన రెస్పాన్స్ రావడంతో అప్పటికే ఉన్న అంచనాలు ఇంకా పెరిగాయి.
పుష్ప2 తర్వాత బన్నీ, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు. ఈ సినిమా కూడా పాన్ ఇండియా లెవల్లోనే తెరకెక్కబోతుంది. త్రివిక్రమ్ ఇప్పటివరకు టచ్ చేయని జానర్తో ఈ సినిమాను తెరెక్కించబోతున్నాడట. పీరియాడిక్ జానర్లో ఫిక్షనల్ బ్యాక్ డ్రాప్లో ఓ స్టోరీ ని బన్నీ కోసం త్రివిక్రమ్ రెడీ చేస్తున్నాడట.
ఇప్పటికే త్రివిక్రమ్ ఈ స్రిప్ట్ పై వర్క్ స్టార్ట్ చేసి మెజారిటీ పార్ట్ రెడీ చేశాడని టాక్. బన్నీ కూడా ఈ స్టోరీ డిస్కషన్స్ లో పలుసార్లు పాల్గొన్నట్లు సమాచారం. భారీ బడ్జెట్ తో ఈ సినిమాను గీతా ఆర్ట్స్, హారికా హాసినీ క్రియేషన్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించనున్నాయట. ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ ఆగస్ట్ లో రానుందని టాక్.













