zombie reddy2: క్రేజీ డైరెక్టర్ చేతికి జాంబిరెడ్డి2 దర్శకత్వ బాధ్యతలు
ప్రశాంత్ వర్మ(Prasanth Varma), తేజా సజ్జ(Teja Sajja)ది బ్లాక్ బస్టర్ కాంబినేషన్. ఇప్పటికే వీరిద్దరి కలయికలో రెండు సినిమాలు రాగా ఆ రెండు ఒకదాన్ని మించి ఒకటి సూపర్ హిట్లుగా నిలిచాయి. అందులో మొదటి సినిమా జాంబి రెడ్డి(Zombie Reddy) కాగా రెండో సినిమా హను మాన్(Hanu Man). ఈ రెండు సినిమాలూ మంచి టాక్ తో పాటూ బాక్సాఫీస్ వద్ద బాగా ఆడి నిర్మాతలకు మంచి లాభాల్ని అందించాయి.
అయితే వీరిద్దరి కాంబినేషన్ లో మరో సినిమా రాబోతున్నట్టు ఇప్పటికే వార్తలొచ్చిన విషయం తెలిసిందే. ఆ ప్రాజెక్ట్ మరేదో కాదు జాంబి రెడ్డి సినిమాకు సీక్వెల్ అయిన జాంబిరెడ్డి2 ద నెక్ట్స్ లెవెల్(Zombie Reddy2 The Next Level). ఈ సినిమాను ప్రముఖ టాలీవుడ్ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ (Sithara Entertainments) బ్యానర్ లో నాగ వంశీ(Naga Vamsi) నిర్మించనున్నాడు. ఇదిలా ఉంటే ఈ సినిమాకు ప్రశాంత్ వర్మ(Prasanth Varma) దర్శకత్వం వహించడం లేదు.
జాంబిరెడ్డి2కి ప్రశాంత్ వర్మ కథ మాత్రమే అందించనున్నాడు. ఈ సినిమాతో రానా నాయుడు(Rana Naidu) వెబ్ సిరీస్ డైరెక్టర్ సుపర్ణ్ వర్మ(Suparn Varma) టాలీవుడ్ కు డైరెక్టర్ గా పరిచయం కాబోతున్నాడు. ఈ నేపథ్యంలోనే సుపర్ణ్ ప్రస్తుతం తేజ, ప్రశాంత్ వర్మను కలవడానికి హైదరాబాద్ వచ్చినట్టు తెలుస్తోంది. అయితే మొదట్లో జాంబిరెడ్డి2 ను బాలీవుడ్ నిర్మాణ సంస్థ నిర్మించాలనుకున్నప్పటికీ తర్వాత ఆ సినిమా నాగ వంశీ చేతికి వచ్చింది.













