మంచు మనోజ్‌కు కరోనా పాజిటివ్

టాలీవుడ్ హీరో మంచు మనోజ్‌కు కోవిడ్ సోకింది. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ట్విటర్ ద్వారా వెల్లడిరచారు. నాకు కరోనా పాజిటివ్ అని తేలింది. ఇటీవల నన్ను కలిసిన ప్రతి ఒక్కరు వెంటనే కరోనా పరీక్షలు చేయించుకోవాలని కోరుతున్నా. ప్రతి ఒక్కరూ కరోనా పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలి. ప్రస్తుతం నేను బాగానే ఉన్నా, నా గురించి ఆందోళన అక్కర్లేదు. మీ అందరి ఆశీర్వాదాలతో ఆరోగ్యంగా తిరిగివస్తా. వైద్యులు, నర్సులందరికీ నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెబుతున్నాను అని తెలిపారు.