బాలకృష్ణను కలిసిన తెలుగు యువత ప్రతినిధులు
టాలీవుడ్ నటుడు నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బీబీ3 (వర్కింగ్ టైటిల్) సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. మూవీసెట్స్ లో ఉన్న బాలకృష్ణను తెలంగాణ తెలుగు యువత సభ్యులు కలిశారు. ఈ సందర్భంగా సభ్యులు తెలుగు యువత పోస్టర్లను బాలకృష్ణకు అందించారు. అనంతరం సభ్యులతో కలిసి తెలుగు యువత పోస్టర్లను ప్రదర్శించారు బాలకృష్ణ. సింహా, లెజెండ్ వంటి బ్లాక్ బాస్టర్ హిట్ చిత్రాల తర్వాత బోయపాటి శ్రీను డైరెక్షన్ లో వస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీగా అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్ కు మంచి స్పందన వచ్చింది.
లాక్ డౌన్ ఎఫెక్ట్ తో నిలిచిపోయిన మూవీ షూటింగ్ ఇటీవలే మళ్లీ రీస్టార్ట్ అయింది. బీబీ3 లొకేషన్ లో వైట్ అండ్ వైట్ డ్రెస్ లో కనిపిస్తూ అభిమానుల్లో జోష్ నింపుతున్నాడు. బాలకృష్ణ నయా లుక్ అభిమానులను అలరించడం ఖాయమని తెలుస్తోంది.













