తెలివిగా తప్పించుకున్న తమన్నా
తమన్నా పెళ్లి గురించి ఎప్పటినుంచో వార్తలు వస్తున్నాయి. ఎవరో బిజినెస్ మెన్‌ను తమన్నా పెళ్లాడబోతున్నట్లు ఆ మధ్య జోరుగా ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు తమన్నా ప్రేమాయణం, పెళ్లి గురించి గట్టిగానే వార్తలొస్తున్నాయి. కొంతకాలం నుంచి బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో ఆమె ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది.
ఓ సినిమా కోసం వీళ్లిద్దరూ జంట కట్టగా, అప్పట్నుంచి బయట కూడా చాలా క్లోజ్‌గా కనిపిస్తున్నారు. తమ ప్రేమాయణం గురించి వస్తున్న వార్తలను అటు విజయ్, ఇటు తమన్నా ఎవరూ ఖండించట్లేదు. అలా అని నిజమని కన్ఫర్మ్ అని కూడా చెప్పట్లేదు.
రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో ఈ టాపిక్ మీద తమన్నా స్పందించింది. అయితే ఆమె విజయ్ తో ఉన్న సంబంధాన్ని గురించి ఖండించలేదు. అలాగే కన్ఫర్మ్ కూడా చేయలేదు. అసలు తన పెళ్లి విషయంలో ఏం జరుగుతుందో అర్థం కావట్లేదంటూ చెప్పుకొచ్చింది తమన్నా.
హీరోయిన్లు నిజంగా పెళ్లి చేసుకోవడానికి ముందు వారికి చాలా సార్లు పెళ్లి చేసేస్తారు. ప్రతి శుక్రవారం కూడా మాకు పెళ్లి చేసేస్తుంటారు. బిజినెస్ మ్యాన్ అని, డాక్టర్ అని, యాక్టర్ అని ఇలా వారికి ఇష్టమొచ్చినట్లు ఇష్టమొచ్చినవారితో పెళ్లి చేపిస్తుంటారు. ఇప్పుడు నిజంగా నా పెళ్లి అని చెప్పినా జనాలు నమ్ముతారో లేదో. ఏం జరుగుతుందో చూద్దామంటూ విజయ్ తో లవ్ గురించి ఆన్సర్ చెప్పకుండా తెలివిగా మాట దాటేసింది తమన్నా.













