War2: వార్2 ఎండ్ కార్డ్స్ తర్వాత సర్ప్రైజ్
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్(NTR), బాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో హృతిక్ రోషన్(Hrithik Roshan) కలిసి నటించిన సినిమా వార్2(War2). బ్లాక్ బస్టర్ బాలీవుడ్ హిట్ వార్(War) సినిమాకు సీక్వెల్ గా వస్తోన్న ఈ సినిమా కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇద్దరూ స్టార్ హీరోలు నటిస్తున్న సినిమా కావడంతో పాటూ, వార్2తో ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తుండటంతో వార్2 పై చాలానే ఫోకస్ ఉంది.
యష్ రాజ్ ఫిల్మ్స్(Yash Raj Films) బ్యానర్ లో తెరకెక్కుతున్న వార్2 సినిమా ఆగస్ట్ 14న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుండగా మేకర్స్ ఇప్పుడిప్పుడే ప్రమోషన్స్ ను వేగవంతం చేస్తున్నారు. ప్రమోషన్స్ లో భాగంగా వార్2 నుంచి పలు విషయాలు బయటికొస్తున్నాయి. సినిమాలో ఆడియన్స్ ను థ్రిల్ చేసే విషయాలు చాలా ఉంటాయని మేకర్స్ మొదటి నుంచి చెప్తూనే వస్తున్నారు.
కాగా ఇప్పుడు వార్2 సినిమాలో మరో సర్ప్రైజ్ను కూడా మేకర్స్ ప్లాన్ చేశారట. వార్2 మూవీ ఎండ్ టైటిల్ కార్డ్స్ పడ్డాక ఆలియా భట్(Alia Bhatt) నటిస్తున్న ఆల్ఫా(Alpha) సినిమాకు సంబంధించిన ఓ సీక్వెన్స్ ఉంటుందని, అది ఆడియన్స్ ను థ్రిల్ చేయడం గ్యారెంటీగా ముంబై సినీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇందులో నిజమెంతన్నది తెలియాల్సి ఉంది.







