Raviteja: కిక్కిచ్చిన డైరెక్టర్ తో రవితేజ సినిమా?

సినిమాల విషయంలో మాస్ మహారాజా రవితేజ(Raviteja) స్పీడు గురించి కొత్తగా చెప్పుకోనక్కర్లేదు. రిజల్ట్ తో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేసుకుంటూ వెళ్లే రవితేజ కొత్త సినిమాలను ఎంపిక చేసుకునే టైమ్ లో తన వద్దకు వచ్చిన వాళ్లు సక్సెస్ లో ఉన్నారా లేదా అనే విషయాన్ని పట్టించుకోకుండా కేవలం కథను మాత్రమే చూసి సినిమాలను ఓకే చేస్తుంటాడు.
ఆయన హీరోగా నటించిన మాస్ జాతర(mass jathara) సినిమా అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు రానుండగా, కిషోర్ తిరుమల(kishore tirumala) దర్శకత్వంలో చేస్తున్న మరో సినిమా సంక్రాంతికి రిలీజ్ చేయాలని చూస్తున్నారు. కిషోర్ తిరుమల తర్వాత రవితేజ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. తనకు కిక్(Kick) లాంటి బ్లాక్ బస్టర్ ను ఇచ్చిన సురేందర్ రెడ్డి(Surender Reddy) దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి రవితేజ ప్లాన్ చేస్తున్నారట.
రవితేజ, సురేందర్ రెడ్డి కలిసి కిక్, కిక్2(kick2) సినిమాలు చేశారు. అందులో కిక్ సూపర్ హిట్టవగా, కిక్2 డిజాస్టర్ గా నిలిచింది. మొన్నామధ్య అఖిల్(akhil) తో సురేందర్ రెడ్డి చేసిన ఏజెంట్(Agent) సినిమా కూడా డిజాస్టర్ గా నిలిచింది. ఇటు రవితేజకు కూడా ధమాకా తర్వాత మరో హిట్ లేదు. ఈ నేపథ్యంలోనే వీరిద్దరూ కలిసి సినిమా చేసి, ఇద్దరూ స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. ఈసారి తమ కాంబినేషన్ లో వచ్చే సినిమాతో ఎలాగైనా మంచి హిట్ కొట్టాలని ఇద్దరూ అనుకుంటున్నారట.