ప్రారంభమైన ఎ1 ఎక్స్‌ప్రెస్
సందీప్‌కిషన్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ఎ1 ఎక్స్‌ప్రెస్. డెన్నిస్ జీవన్ కనుకొలను దర్శకత్వం వహిస్తున్నారు. టి.జి.విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్, సందీప్‌కిషన్, దయా పన్నెం నిర్మాతలు. సోమవారం చిత్రకరణ మొదలు పెట్టారు. సందీప్‌తోపాటు మురళీశర్మ, రఘుబాబు తదితరులపై కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. హాకీ నేపథ్యంలో తెరకెక్కుతున్న తొలి తెలుగు చిత్రమిది. క్రీడా నేపథ్యంలో సందీప్ చేస్తున్న మొదటి సినిమా కూడా ఇదే. తప్పకుండా ప్రేక్షకులకి కొత్త తరహా వినోదాన్ని పంచుతుంది అన్నాయి చిత్రవర్గాలు. ఈ సినిమాకి సంగీతం: హిప్ హాప్ తమిళ, ఛాయాగ్రహణం: కెవిన్ రాజు, కూర్పు: ఛోటా కె.ప్రసాద్, కళ: అలీ.













