‘నిను వీడని నీడను నేనే’ ఫస్ట్ లుక్ విడుదల
కథానాయకుడు సందీప్‌కిషన్ నిర్మాతగా మారారు. వెంకటాద్రి టాకీస్ పతాకంపై దయా పన్నెం, విజి.సుబ్రహ్మణ్యన్‌తో కలిసి తానే కథానాయకుడిగా నటిస్తూ ”నిను వీడని నీడను నేనే” అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అన్య సింగ్ కథానాయిక. కార్తీక్ రాజు దర్శకత్వం వహిస్తున్నారు. అనిల్సుంకర్ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా ఫస్ట్‌లుక్‌ని విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ అతీంద్రీయ శక్తుల నేపథ్యంలో సాగే కథ ఇది. ఎవరూ స్పృశించని ఓ విభిన్నమైన అంశం ఆధారంగా, ఉన్నతమైన సాంకేతిక విలువలతో చిత్రాన్ని రూపొందిస్తున్నాం. సందీప్‌కిషన్‌ని మరో కొత్త పాత్రలో చూస్తారు ప్రేక్షకులు. త్వరలోనే ట్రైలర్‌ని, పాటల్ని విడుదల చేస్తాం అన్నారు. నిర్మాతల్లో ఒకరైన దయా పన్నెం మాట్లాడుతూ మా సినిమా చూసి గూఢచారి చిత్రాన్ని విడుదల చేసిన విస్తా మర్చంట్స్ సంస్థ కూడా నిర్మాణంలో పాలు పంచుకొంది. అనిల్ సుంకర ఈ చిత్రాన్ని విడుదల చేస్తుండడం ఆనందంగా ఉంది అన్నారు. పోసాని కృష్ణమురళి, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, పూర్ణిమ భాగ్యరాజ్, ప్రగతి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: తమన్.













