సుకుమార్ నెక్ట్స్ హీరో ఎవరు?
పుష్ప సినిమాతో పాన్ ఇండియా డైరెక్టర్ గా క్రేజ్ తెచ్చుకున్నాడు డైరెక్టర్ సుకుమార్. ఆర్య నుంచి పుష్ప1 వరకు వచ్చిన సుకుమార్ సినిమాలేవీ ఆడియన్స్ ను నిరాశ పరచలేదు. పుష్ప సినిమాతో తెలుగు సినిమా స్థాయిని పెంచడంలో సుకుమార్ కృషి చాలానేఉంది. పుష్ప1తో నేషనల్ స్థాయిలో అలరించిన సుకుమార్ ప్రస్తుతం పుష్ప2 షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.
పుష్ప 2 తర్వాత సుకుమార్ ఏ సినిమా చేయనున్నాడు? ఎవరితో చేయనున్నాడనేది ఇప్పుడు పాన్ ఇండియా ప్రశ్నగా మారిపోయింది. అయితే సుకుమార్ తర్వాతి సినిమా కచ్ఛితంగా మెగా కాంపౌండ్లోనే ఉంటుందని ఇప్పటికే లీక్స్ వచ్చాయి. మెగా కాంపౌండ్ అంటే చాలా మందే హీరోలున్నారు. వారిలో ఎవరనేది ఇప్పుడు అసలు ప్రశ్న.
అల్లు అర్జున్ తో పుష్ప2 పూర్తి చేయగానే సుకుమార్ చాలా తక్కువ గ్యాప్ లోనే తన తర్వాతి సినిమాను ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తోంది. ఈ క్రమంలో ఇద్దరు మెగా హీరోల్లో ఒకరితో సుకుమార్ తన తర్వాతి సినిమాను చేసే అవకాశాలున్నట్లు సమాచారం. ఆ ఇద్దరు మరెవరో కాదు. ఒకరు చిరంజీవి, మరొకరు రామ్ చరణ్. ఇప్పటికే చరణ్ తో కలిసి రంగస్థలం చేశాడు సుక్కు. తనతో సినిమా అంటే చరణ్ కూడా సై అంటాడు. కానీ గేమ్ ఛేంజర్ తర్వాత చరణ్, బుచ్చిబాబు తో సినిమాను ఫిక్స్ చేసుకున్నాడు. త్వరలోనే ఆ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. బుచ్చిబాబు సినిమా పూర్తవగానే చరణ్ ఈ సినిమా చేసే ఛాన్స్ లేదు. కాబట్టి సుకుమార్ తర్వాతి సినిమా చిరంజీవితోనే ఉంటుందని మెగా కాంపౌండ్ వర్గాలంటున్నాయి. ఈ కాంబినేషన్ పై మెగా ఫ్యాన్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఉన్నారు.













