Samantha: సమంత ‘శుభం’ టీజర్ రేపే!
ఏ మాయ చేసావే(Ye Maya Chesave)తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సమంత(Samantha) ఫస్ట్ మూవీతోనే నటిగా మంచి మార్కులు తెచ్చుకోవడంతో పాటూ ఎంతోమంది ఫ్యాన్స్ ను సంపాదించుకుంది. తక్కువ కాలంలో స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చున్న సమంత ఇప్పుడు శుభం(Subham) మూవీతో నిర్మాతగా మారుతోంది. ఆల్రెడీ ఈ సినిమాను అనౌన్స్ చేసి ఆడియన్స్ లో మంచి హైప్ తెచ్చిన సమంత తాజాగా దానికి సంబంధించిన ఓ అనౌన్స్మెంట్ ను షేర్ చేసింది.
శుభం టీజర్(Subham Teaser) ను లాంచ్ చేయనున్నట్టు సమంత ఇన్‌స్టాలో ఓ పోస్ట్ ను షేర్ చేసింది. 30న టీజర్ రిలీజ్, శుభం అంటూ సమంత షేర్ చేయగా, త్రలాలా మూవింగ్ పిక్చర్స్ కూడా దానికి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ వీడియోను షేర్ చేసింది. ఈ వీడియో కొత్తగా, ఇన్నోవేటివ్‌గా ఉంటూ సినిమాపై అంచనాలను పెంచేలా ఉంది.
ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు నిర్మాతగా మారిన సమంతకు ఆల్రెడీ పలు బిజినెస్ లు ఉన్నాయి. ఇప్పటికే ఫ్యాషన్, బ్యూటీ, ఎడ్యుకేషన్ లో ఎంటర్ప్రెన్యూర్ గా ఉన్న సమంత చేస్తున్న కొత్త బిజినెస్ సినిమా నిర్మాణం. మరి ఈ కొత్త బిజినెస్ సమంతకు ఎలాంటి ఫలితాన్ని మిగులుస్తుందో చూడాలి. నటిగా సమంత ఎలా సక్సెస్ అయిందో నిర్మాతగా కూడా అలానే సక్సెస్ అవాలని ఆమె ఫ్యాన్స్ కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు.













