హీరోగా ప్రదీప్ ?
బుల్లితెరపై మంచి ఫాలోయింగ్ ఉన్న యాంకర్లలో ప్రదీప్ ఒకరు. అనేక కార్యక్రమాల ప్రయోక్తంగా ఆయన ఆకట్టుకుంటున్నారు. గతంలో కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో కనిపించి, మెప్పించిన ప్రదీప్ ఈసారి పూర్తిస్థాయి హీరోగా నటిస్తున్నట్టు తెలిసింది. 1947 నాటి కథతో తెరకెక్కిస్తున్నారట. సుకుమార్ దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన మున్నా అనే యువకుడు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అనూప్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం చిత్రీకరణ దశలో ఉన్నట్లు తెలిసింది. ఈ సినిమాకు సంబంధించిన విశేషాలు అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.













