స్టాలిన్ ఆడియో సీడీని విడుదల చేసిన రాంగోపాల్ వర్మ
జీవా కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం స్టాలిన్. అందరివాడు ఉపశీర్షిక. రతిన శివ దర్శకుడు. ఇషారి కె గణేష్, నట్టి కరుణ, నట్టి క్రాంతి నిర్మాతలు. రియా సుమన్, గాయత్రికృష్ణ నాయికలు. తెలుగు, తమిళ భాషల్లో ఈ నెల 7న ప్రేక్షకులముందుకు రానుంది. ఈ చిత్ర గీతావిష్కరణ హైదరాబాద్‌లో జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన రామ్‌గోపాల్ వర్మ ఆడియో సీడీని ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ ట్రైలర్ చాలా బాగుంది. జీవా ఈజ్‌తో నటించాడు. ఇందులో నవదీప్ ప్రతినాయకుడిగా విభిన్నమైన గెటప్‌లో కనిపించాడు అన్నారు. రంగం నుంచి నన్ను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. యాక్షన్‌తో పాటు ఫ్యామిలీ అంశాలు కలబోసిన చిత్రమిది. ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. త్వరలో తెలుగులో స్ట్రెయిట్ సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నాం అని జీవా చెప్పారు. దర్శకుడు మాట్లాడుతూ తెలుగు నేటివిటీకి కనెక్ట్ అయ్యే కథాంశమిది. ఇందులో చక్కటి సామాజిక సందేశం ఉంటుంది అన్నారు. మంచి పాయింట్‌తో ఈ సినిమా తీశారు. తెలుగులో దాదాపు 400 థియేటర్లలో విడుదల చేస్తున్నాం అని నట్టి కుమార్ తెలిపారు.













