సూర్య సినిమాలో ఛాన్స్ కొట్టేసిన సీనియర్ హీరోయిన్
ప్రస్తుతం సూర్య నటిస్తున్న కంగువ అక్టోబర్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. సూర్య ట్రైబల్ వారియర్ గా కనిపించనున్న ఈ సినిమాపై ఎన్నో అంచనాలున్నాయి. ఈ సినిమా తర్వాత సూర్య, కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో తన 44వ సినిమాను చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది.
సూర్య44పై పూజా ఎన్నో ఆశలు పెట్టుకుంది. గతేడాది జిగర్తండ డబుల్ ఎక్స్ సినిమాతో కోలీవుడ్లో మంచి హిట్ అందుకున్న కార్తీక్, సూర్య44ని యూనివర్సల్ కాన్సెప్ట్ తో తీస్తున్నాడు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ఉందట. ఆ సాంగ్ కోసం సీనియర్ స్టార్ హీరోయిన్ శ్రియా శరణ్ ను కార్తీక్ సుబ్బరాజు ఎంపిక చేసినట్లు సమాచారం.
ప్రస్తుతం శ్రియ ఎక్కువగా క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేస్తుంది. రీసెంట్ గా షో టైమ్ అనే బాలీవుడ్ వెబ్ సిరీస్ లో నటించిన శ్రియకు ఇప్పుడు ఊహించని విధంగా సూర్య సినిమాలో ఐటెం సాంగ్ చేసే ఛాన్స్ లభించింది. సూర్య44 పాన్ ఇండియా స్థాయిలో వస్తున్న సినిమా కావడంతో ఈ సాంగ్ క్లిక్ అయితే శ్రియాకు మళ్లీ అవకాశాలు పెరిగే ఛాన్సుంది. అయితే శ్రియ ఇప్పటికే చాలా మంది కోలీవుడ్ స్టార్లతో జతకట్టింది కానీ సూర్యతో మాత్రం ఇప్పటివరకు కలిసి చేసింది లేదు. ఇన్నేళ్లకు వీరిద్దరూ కలిసి ఒకే సినిమాలో కనిపించనున్నారు.













