Siva Karthikeyan: మరోసారి ఆ డైరెక్టర్ తో శివ కార్తికేయన్?

గతేడాది అమరన్(amaran) సినిమాతో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న తమిళ టాలెంటెడ్ హీరో శివ కార్తికేయన్(siva karthikeyan) ఆ తర్వాత ఒకప్పటి కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మురుగదాస్(murugadoss) దర్శకత్వంలో మదరాసి(madarasi) అనే సినిమా ను చేసిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 5న ప్రేక్షకుల ముందుకొచ్చిన మదరాసి సినిమాకు కోలీవుడ్ లో మంచి ఫలితాలే వచ్చినప్పటికీ మిగిలిన భాషల్లో మాత్రం చెప్పుకోదగ్గ రిజల్ట్స్ రాలేదు.
మురుగదాస్ ఫామ్ లో లేకపోయినా కథపై నమ్మకంతో శివ కార్తికేయన్ మదరాసిని చేశాడు. కానీ ఆ సినిమా ఆశించిన ఫలితాన్నివ్వకపోవడంతో అతని ఫ్యాన్స్ డిజప్పాయింట్ అయ్యారు. అయితే మురుగదాస్ ఆల్రెడీ మదరాసితో నిరాశ పరిచినప్పటికీ మరోసారి అతనితో చేతులు కలపడానికి ఈ టాలెంటెడ్ హీరో రెడీ అయ్యారని కోలీవుడ్ మీడియా వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
మదరాసి షూటింగ్ టైమ్ లోనే శివ కార్తికేయన్ కు మురుగదాస్ ఓ కథ చెప్పారని, ఆ కథ పై శివ కార్తికేయన్ కూడా ఆసక్తి చూపించారని అంటున్నారు. ఆల్రెడీ మదరాసి రిజల్ట్స్ ను చూశాక మరోసారి ఆ డైరెక్టర్ తో శివ కార్తికేయన్ చేతులు కలుపుతాడా? కలిపితే అతని ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతారనేది ఆసక్తికరంగా మారింది. కాగా ప్రస్తుతం శివ కార్తికేయన్, సుధా కొంగర(sudha kongara) దర్శకత్వంలో పరాశక్తి(parasakthi) సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.