Sithara& Haarika: బిజీ బిజీగా సితార, హారికా బ్యానర్లు
ప్రస్తుతమున్న పరిస్థితుల్లో రెండు పెద్ద సినిమాలు సెట్స్ మీదుంటే వాటినే బ్యాలెన్స్ చేయడం నిర్మాతకు కష్టమవుతుంది. అలాంటిది ఒకే టైమ్ లో టైర్1 నుంచి టైర్3 వరకు అరడజను ప్రాజెక్టులను లైన్ లో పెట్టడమంటే మాటలు కాదు. అదీ కంటెంట్ విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండే హారికా హాసినీ(Haarika Haassine creations), సితార ఎంటర్టైన్మెంట్స్(Sithara Entertainments) గురించి చెప్పక్కర్లేదు.
రానున్న రెండేళ్లలో వారు ప్లాన్ చేసిన సినిమాల గురించి చూస్తే షాకవ్వక మానరు. వారి నుంచి ముందుగా సంక్రాంతికి బాలకృష్ణ(Balakrishna) డాకు మహారాజ్(Daku Maharaj) రానుంది. ఈ సినిమాపై మంచి అంచనాలున్నాయి. బాబీ(Bobby Kolli) దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా గురించి నిర్మాత నాగవంశీ(Naga Vamsi) ఇప్పటికే చాలా చెప్తున్నాడు. కొత్త క్యాస్టింగ్ తో గౌతమ్ తిన్ననూరి(Gowtham Thinnanuri) చేసిన మేజిక్ చివరి దశలో ఉంది.
విజయ్ దేవరకొండ(Vijay Devarakonda)- గౌతమ్ తిన్ననూరి కాంబోలో వస్తున్న వీడీ12(VD12) హైప్ ఓ రేంజ్ లో ఉంది. మ్యాడ్(MAD) సీక్వెల్ మ్యాడ్ స్వ్కేర్(Mad Square) కూడా సమ్మర్ లోనే రానుంది. నవీన్ పోలిశెట్టి(Naveen Polishetty) అనగనగా ఒక రోజు(Anaganga Oka Roju) రీసెంట్ గా ఫ్రెష్ గా అనౌన్స్ చేశారు. రవితేజ(ravi teja) మాస్ జాతర(Mass Jathara) మే9న రిలీజ్ కానుంది. సినిమాటోగ్రాఫర్ రవి కె చంద్రన్ డైరెక్షన్ లో తమర(thamara) అనౌన్స్ చేసి మూడేళ్లైంది.
ఇవి కాకుండా బన్నీ(bunny)- త్రివిక్రమ్(Trivikram), ఎన్టీఆర్(NTR)- నెల్సన్ దిలీప్ కుమార్(Nelson Dileep Kumar), విశ్వక్సేన్(Viswaksen)- అనుదీప్(Anudeep), ఆనంద్ దేవరకొండ(Anand Devarakonda)- ఆదిత్య హాసన్(Aditya Hassan), సూర్య(Suriya)- వెంకీ అట్లూరి(Venky Atluri), మోక్షజ్ఞ(Mokshagna)- వెంకీ అట్లూరి, సిద్దు జొన్నలగడ్డ కోహినూర్(Kohinoor), కళ్యాణ్ శంకర్(Kalyan Shankar) దర్శకత్వంలో ఓ సూపర్ హీరో మూవీ, అల్లరి నరేష్(Allari Naresh), సిద్దు జొన్నలగడ్డ, అశోక్ గల్లా(Ashok Galla)తో విడివిడిగా మూడు సినిమాలున్నాయి వీటిలో చాలా వరకు లాకయిపోయాయి. ఒక నిర్మాణ సంస్థ ఇంత బిజీగా ఉండటం చూసి అందరూ షాకవుతున్నారు.













