సింగర్స్‌ని వెంటాడుతున్న కరోనా.. సింగర్ మాళవిక రెండేళ్ళ కూతురికి కూడా కరోనా!
కరోనా భారతదేశంలో ప్రవేశించి నెలలు గడుస్తున్నా ఎక్కడా తగ్గుముఖం పడుతున్న దాఖలాలు లేవు. ప్రభుత్వాలు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా దాన్ని కట్టడి చేయడం ఎవరి వల్లా కావడం లేదు. ప్రతి రాష్ట్రంలోనూ ప్రతిరోజూ వందల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. దేశవ్యాప్తంగా ప్రతిరోజూ వేల మంది కరోనా మహమ్మారి కారణంగా ప్రాణాలు విడుస్తున్నారు. కరోనా ఎవ్వరినీ విడిచిపెట్టడం లేదు. చిన్నా, పెద్దా అనే తేడా లేదు. మనిషి అయితే చాలు. అన్ని రంగాలకు చెందిన ప్రముఖులు కరోనా కాటుకు బలవుతున్నారు. తాజాగా సింగర్స్‌ని వెంటాడుతోంది కరోనా. గత కొంతకాలంలో ప్రముఖ సింగర్ ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం కరోనా బారిన పడి చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. కొత్తగా సింగర్స్ సునీత, మాళవికలకు కరోనా సోకింది. ఈ విషయాన్నివారే స్వయంగా వెల్లడించారు.
తాజా సమాచారం మేరకు సునీత ట్రీట్మెంట్ తీసుకొని ప్రస్తుతం ఆరోగ్యంగా ఉందని తెలుస్తోంది. ఇక మాళవిక హోమ్ ఐసోలేషన్‌లో ఉంది. ఇప్పుడు ఆమె రెండేళ్ళ కూతురికి కూడా కరోనా సోకిందని తెలుస్తోంది. అంతేకాదు, ఆమె మాళవిక తల్లిదండ్రులకు కూడా పాజిటివ్ వచ్చిందట. మొదట తనకు జలుబు, జ్వరం రావడంతో కరోనా పరీక్షలు చేయించుకున్నానని, దీంతో కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని చెప్పింది. తమ కుటుంబ సభ్యులకు ఎలాంటీ లక్షణాలు లేకున్నా.. కూడా పరీక్ష చేయగా.. వారికీ కరోనా సోకినట్లు తెలిసిందని వివరించింది. ప్రస్తుతం తన భర్త కృష్ణచైతన్య తనకు అన్నివిధాలా సాయం చేస్తున్నాడని తెలిపింది.













