బంపరాఫర్ కొట్టేసిన మనోజ్ హీరోయిన్
డార్లింగ్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన రాధే శ్యామ్ జులై 30న విడుదల కానుంది. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ సహా ఐరోపాలో పూర్తయిన సంగతి తెలిసిందే. పెండింగ్ పనులు పూర్తి చేసి.. జులై మొదటి వారానికి ప్రింట్ ను రెడీ చేయాలన్నది యూనిట్ ప్లాన్. లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ సినిమాలో బాలీవుడ్ నటి సిమ్రాన్ కౌర్ ముండికి ఛాన్స్ దొరికిందని, కథ మొత్తం ఈమె క్యారెక్టర్ చుట్టూనే తిరుగుతుందని, ఈ పాత్ర కోసం తనను సంప్రదించారని, స్క్రిప్ట్ కూడా వినకుండానే సినిమాకు ఓకే చేసిందని తెలుస్తుంది.
గతంలో పోటుగాడు చిత్రంలో మంచు మనోజ్ సరసన నటించిన సిమ్రన్ ఆ తర్వాత ఇప్పటి వరకు మరో తెలుగు సినిమా చేసింది లేదు. ఆ సినిమా తర్వాత తిరిగి ముంబైకి షిఫ్టయ్యి, అక్కడ చిన్న బడ్జెట్ చిత్రాలు, వెబ్ సిరీస్ లు చేస్తూ వచ్చింది. 2020లో గురిక్ మాన్ ను పెళ్లి చేసుకున్న సిమ్రన్ ఇప్పుడు మళ్లీ హీరోయిన్ గా తన సత్తా చాటేందుకు ప్రయత్నిస్తుంది.













