దశాబ్దాల తర్వాత జత కట్టనున్న క్రేజీ కాంబినేషన్!
కోలీవుడ్‌లో ఒకప్పుడు సెన్సేషనల్ పెయిర్‌గా గుర్తింపు తెచ్చుకున్న జంట శింబు(Simbhu), నయనతార(Nayanathara). వీరిద్దరి ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ అప్పట్లో ఆడియన్స్ ను విశేషంగా ఆకట్టుకుంది. సినిమాలతో పాటు పర్సనల్ లైఫ్ కు సంబంధించిన వార్తలతోనూ ఈ జంట తరచూ వార్తల్లో నిలిచింది. అయితే చాలా కాలంగా కలిసి నటించని ఈ ఇద్దరు ఇప్పుడు మరోసారి వెండితెరపై సందడి చేసేందుకు రెడీ అవుతున్నట్టు కోలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. దాదాపు దశాబ్దాల గ్యాప్ తర్వాత ఈ క్రేజీ కాంబినేషన్‌ను తెరపైకి తీసుకొచ్చేందుకు ఓ యంగ్ డైరెక్టర్ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.
డ్యూడ్(DUde) సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ కీర్తీశ్వరన్(keerhiswaran) ఈ ప్రాజెక్ట్‌ను తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే స్టోరీ డిస్కషన్స్ పూర్తయ్యాయని, శింబు, నయనతార ఇద్దరినీ ఈ సినిమాకు ఒప్పించడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడని తమిళ సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. వచ్చే ఏడాది ఈ సినిమా షూటింగ్ మొదలు కానుందని సమాచారం. ఇందులో శింబు పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారని, ఫుల్ లెంగ్త్ కమర్షియల్ ఎంటర్టైనర్గా ఈ సినిమాను రూపొందించనున్నారని తెలుస్తోంది.
ప్రస్తుతం సరైన సక్సెస్‌ల కోసం ఎదురుచూస్తున్న శింబు, నయనతారలకు ఈ సినిమా కీలకంగా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా తమిళంలో వరుస ఫ్లాపులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న నయనతారకు ఈ ప్రాజెక్ట్‌పై ఆశలు ఉండొచ్చు. మరోవైపు శింబు కూడా మంచి సక్సెస్ ను అందుకోవాలని చూస్తున్నారు. ఈ నేపథ్యంలో వీరిద్దరి కలయికపై భారీ ఆసక్తి నెలకొంది. త్వరలోనే మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే అవకాశముందని సమాచారం.








