ఒక్కటి కాబోతున్న బాలీవుడ్ స్టార్స్..కియారా, సిధ్ పెళ్లి డేట్ ఫిక్స్..?
సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ బాలీవుడ్ లో ప్రెజెంట్ లవ్ బర్డ్స్ అని చెప్పొచ్చు. ఈ స్టార్స్ పై గత ఏడాది కాలంగా చాలా రకాల కథనాలు వస్తున్నాయి. ముంబై మీడియా అయితే ఈ జంటను వెంటాడి, పబ్లిక్ లో చాలాసార్లు విసిగించింది కూడా. కలిసి జంటగా షికార్లు చేసినా లేదా విడివిడిగా విహార యాత్రలకు వెళ్లినా ఆ ఇద్దరినీ జతగా చూసేందుకే ముంబై మీడియా ఇంట్రెస్ట్ చూపించింది.
ఈ మోస్ట్ బ్యూటిఫుల్ జోడి పెళ్లి గురించిన ముచ్చట్లు ఇప్పుడు బాలీవుడ్ లో చర్చనీయాంశమైంది. ఈ జంట కొన్ని అందమైన కపుల్ గోల్స్ తో తమ అభిమానుల్లో స్ఫూర్తి నింపుతోంది. వీటిని వారి ఫాన్స్ అంతా ఫాలో అవుతున్నారంటే అతిశయోక్తి కాదు. ఇటీవల సోషల్ మీడియాలో ఫోటో షూట్స్ తో కియారా, సిధ్ చేస్తున్న హడావిడి అంతా ఇంతా కాదు. ఈ జంట చేసే సందడి అభిమానుల దృష్టిని విపరీతంగా ఆకర్షిస్తోంది. సిద్ధార్థ్ మల్హోత్రా -కియారా అద్వానీ బాలీవుడ్ లో అత్యంత అందమైన జంటలలో ఒకరు. పర్ఫెక్ట్ కపుల్ గా అభిమానులు ఈ జోడీని చూస్తున్నారు. ఈ జంట పెళ్లికి సంబంధించిన ప్రతి చిన్న విషయం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఫైనల్ గా ఈ హాట్ కపుల్ పెళ్లి తేదీ ఫిక్సయింది.
సిద్ధార్థ్ మల్హోత్రా -కియారా అద్వానీ బాలీవుడ్ లో అత్యంత అందమైన జంటలలో ఒకరు. పర్ఫెక్ట్ కపుల్ గా అభిమానులు ఈ జోడీని చూస్తున్నారు. ఈ జంట పెళ్లికి సంబంధించిన ప్రతి చిన్న విషయం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఫైనల్ గా ఈ హాట్ కపుల్ పెళ్లి తేదీ ఫిక్సయింది.
`షేర్ షా` జోడి సిద్ధార్థ్ మల్హోత్రా -కియారా అద్వానీలు ఫిబ్రవరి నెలలో పెళ్లికి సిద్ధంగా ఉన్నారని సమాచారం. 6 ఫిబ్రవరి 2023 తేదీని వెడ్ లాక్ చేశారని కథనాలొస్తున్నాయి. ఇదే నిజమైతే ఈ అందమైన జంట అభిమానులందరికీ ఆనందాన్నిచ్చే ఘడియ ఇది. బాలీవుడ్ లో మరో గ్రాండ్ వెడ్డింగ్ ని వీక్షించేందుకు అంతా రెడీ అవుతున్నారు.













