శ్రియకు రాజమౌళి అన్యాయం చేస్తున్నాడా…?
రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న పాన్ ఇండియన్ ఫిల్మ్ ఆర్ఆర్ఆర్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్న విషయం తెలిసిందే. చారిత్రాత్మక ధీరుల జీవితాలను ఆధారంగా చేసుకుని రూపొందుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీమ్ గా కనిపిస్తుంటే, రామ్ చరణ్ అల్లూరి సీతారామ రాజు పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమాపై అంచనాలు రోజురోజుకీ ఆకాశాన్నంటుతున్నాయి. రిలీజ్ డేట్ ను ఎప్పుడైతే యూనిట్ ప్రకటించిందో అప్పటి నుంచి సందడి మొదలైంది. ఈ సంవత్సరం దసరా కానుకగా ఆర్ఆర్ఆర్ మూవీని అక్టోబర్ 13న విడుదల చేయనున్నట్లు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు.
అయితే ఆర్ఆర్ఆర్ లో చరణ్ కు జోడీగా అలియా భట్, ఎన్టీఆర్ కు జోడీగా ఒలీవియా మోరిస్ లు నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన పోస్టర్లు, ఇంట్రడక్షన్ ప్రోమోలు సినిమాపై అంచనాల్ని విపరీతంగా పెంచేస్తున్నాయి. ఇప్పుడు తాజాగా ఈ సినిమాకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ కు సంబంధించిన క్లైమాక్స్ షూటింగ్ జరుగుతుందన్న విషయం అందరికీ తెలిసిందే. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న టైమ్ లో రాజమౌళి టీమ్.. ఇప్పటి వరకు షూటింగ్ పూర్తి చేసుకున్న సీన్స్ ను ఎడిట్ చేసే పనిలో పడ్డారట.
దీనిలో భాగంగానే హీరోయిన్ శ్రియ నటించిన సీన్స్ కూడా కట్ చేస్తున్నారట. అజయ్ దేవగన్ గురువు పాత్రను పోషించగా, తన భార్య పాత్రను శ్రియ పోషించిందట. ఇప్పుడు శ్రియ కు రిలేటెడ్ సీన్స్ అన్నీ తొలగించినట్లు చెప్తున్నారు. మరి లెంగ్త్ ఎక్కువైందని తన క్యారెక్టర్ ను కట్ చేస్తున్నారో, లేక మరి ఏ ఇతర కారణాల వల్ల తన క్యారెక్టర్ ను తొలగిస్తున్నారో తెలీదు కానీ శ్రియకు మాత్రం అన్యాయం చేస్తున్నారంటూ నెటిజన్లు అభిప్రాయ పడుతున్నారు. మరి ఈ విషయంపై రాజమౌళి ఎలాంటి డెసిషన్ తీసుకుంటారో చూడాలి.













