షాకిస్తున్న త్రివిక్రమ్ సైడ్ ఇన్ కమ్..
ఒక్కొక్క సినిమాకు 10 నుంచి 15 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకునే త్రివిక్రమ్ కు ఇంకేమైనా సైడ్ ఇన్ కమ్ ఉందా అంటే దానికి కూడా కొదువేమీ లేదని తెలుస్తుంది. అప్పుడప్పుడు షూటింగ్ కు గ్యాప్ దొరికినప్పుడు కమర్షియల్ యాడ్స్ షూటింగ్స్ కు వెళ్లి, ఒక్కో యాడ్ ను రెండు లేదా మూడు రోజుల్లోనే షూటింగ్ కంప్లీట్ చేస్తారు.
అంతేకాదు ఆ యాడ్ షూట్ చేయడానికి త్రివిక్రమ్ ఛార్జ్ చేసే రెమ్యూనరేషన్ కూడా ఒక రేంజులో ఉంటుందట. మామూలుగా అయితే ఒక యాడ్ ను షూట్ చేస్తే ముంబై లోని స్టార్ డైరక్టర్లకు 10 నుంచి 15 లక్షలు ఇస్తారట కానీ త్రివిక్రమ్ మాత్రం ఏకంగా 30 లక్షలు ఒక యాడ్ కు రెమ్యూనరేషన్ గా తీసుకుంటున్నట్లు చెప్తున్నారు.
ఇప్పటికే త్రివిక్రమ్ మహేష్, మరియు కొంత మంది హీరోలతో కమర్షియల్ యాడ్స్ ను రూపొందించారు. రీసెంట్ గా మహేష్ చేసిన రెండు యాడ్స్ లో ఒకటి త్రివిక్రమ్ డైరక్ట్ చేసిందే. అంటే ఒక పక్క సినిమాలతో పాటూ మరో పక్క ఈ విధంగా కూడా త్రివిక్రమ్ బాగానే వెనుకేస్తున్నాడన్నమాట. ప్రస్తుతం త్రివిక్రమ్ ఏకే రీమేక్ కు మాటలు అందిస్తుండగా, ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ నటించే సినిమాకు త్రివిక్రమే దర్శకత్వం వహించనున్నాడు.













