ఫోర్బ్స్ జాబితాలో షారుక్, సల్మాన్, అక్షయ్
ప్రపంచంలో అత్యధికంగా పారితోషికం తీసుకుంటున్న సెలబ్రిటీల్లో మనల్లో ఉన్నారు. ప్రముఖ అమెరికన్ బిజినెస్ మ్యాగజైన్ ఫోర్బ్స్ విడుదల చేసిన 100 మంది జాబితాలో భారతీయ నటులు ముగ్గురికి చోటు దక్కింది. అందులో షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్ ఉన్నారు. 2016 జూన్ 1 నుంచి 2017 జూన్ 1 వరకు లెక్క ప్రకారం ఈ జాబితాను విడుదల చేశారు. వంద మంది జాబితాలో షారుఖ్ ఖాన్ 65వ స్థానంలో నిలిచారు. భారతీయ నటుల్లో మొదటి స్థానంలో ఉన్నారు. ఈయన 38 మిలియన్ డాలర్ల (రూ.245 కోట్లు) పారితోషికం తీసుకున్నారు. 2016లో షారుక్ ఖాన్ హీరోగా చేసిన చిత్రాలు ఫ్యాన్ డియర్ జిందగీ ప్రేక్షకుల ముందుకొచ్చాయి. డియర్ జిందగీ మాత్రమే విజయం సాధించింది. 67వ స్థానంలో సల్మాన్ ఖాన్ నిలిచారు. ఈ హీరో ఈ ఏడాది సుల్తాన్ చిత్రమొక్కటే చేశాడు. అది ఘన విజయం సాధించింది. 37 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.238 కోట్లు) పారితోషికం తీసుకున్నారు. అక్షయ్ కుమార్ ఈ సంవత్సరం మూడు సినిమాలు చేస్తే మూడు బాక్సాఫీస్ వద్ద రికార్డు మోత మోగించారు. 35.5 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.228 కోట్లు) పారితోషికంతో అక్షయ్ 80వ స్థానంలో ఉన్నాయి. ఎయిర్‌లిఫ్ట్ రుస్తుం, హౌస్‌పుల్ ఆయన చేసిన చిత్రాలు.













