చిరు వచ్చినా.. తేజ్ వెనక్కి తగ్గడట!
సంక్రాంతి బరిలో సంబరాల ఏటి గట్టు(sambarala yeti gattu) కూడా తన ప్లేస్ ను ఫిక్స్ చేసుకుంటోంది. సాయిధరమ్ తేజ్(sai dharam tej) హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు భారీ స్థాయిలో బడ్జెట్ కేటాయించారు. దాదాపు రూ.100 కోట్ల బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్ 2026లోనే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉన్నా, షూటింగ్ తో పాటు వీఎఫ్ఎక్స్ వర్క్స్ లో ఆలస్యమవుతున్న కారణంగా వాయిదా పడింది. ఇప్పుడు సంక్రాంతి సీజన్‌ను టార్గెట్ చేస్తూ రిలీజ్ కు సిద్ధమవుతోంది.
అయితే అదే సమయంలో చిరంజీవి(chiranjeevi) నటిస్తున్న కాకా(kaaka) కూడా సంక్రాంతి రేసులో ఉంది. మరోవైపు విశ్వంభర(viswambhara)ను కూడా అదే సీజన్లో తీసుకురావాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో మామ చిరంజీవి సినిమా ఉన్నప్పుడు సాయిధరమ్ తేజ్ సినిమాను రిలీజ్ చేస్తారా అనే డిస్కషన్ మొదలైంది. దీనిపై నిర్మాత చైతన్య రెడ్డి(chaitanya reddy) క్లారిటీ ఇచ్చారు. సంబరాల ఏటి గట్టు రిలీజ్ డేట్ ను తామే ముందుగా అనౌన్స్ చేశామని, అందుకే సంక్రాంతి రిలీజ్ విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని తెలిపారు.
ప్రస్తుతం కాకా జనవరి 13న రిలీజ్ కాన్నుట్టు అనౌన్స్ చేసింది. విశ్వంభర విషయంలో మాత్రం ఇంకా ఫైనల్ డెసిషన్ రాలేదు. సంక్రాంతి రిలీజ్‌ను ఓటీటీ సంస్థలు డీల్‌లో కీలక షరతుగా పెట్టినట్లు తెలుస్తోంది. ఆ కండిషన్ నెరవేరకపోతే ఓటీటీ డీల్‌పై ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. దీంతో సంక్రాంతి బరిలో ఎవరి సినిమాకు ఎలాంటి స్థానం దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది.








