Aarasan: శింబు సరసన సమంత?

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్, నేషనల్ అవార్డ్ విన్నర్ వెట్రిమారన్(vetrimaran) తో తమిళ స్టార్ హీరో శింబు(Simbhu) ఓ మూవీ చేయనున్నారని గత కొన్నాళ్లుగా వార్తలొస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ వార్తలను నిజం చేస్తూ మేకర్స్ మూవీని అనౌన్స్ చేస్తూ టైటిల్ ను రివీల్ చేశారు. ఆరసన్(aarasan) అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా శింబు కెరీర్లో 49వ చిత్రంగా వస్తోంది.
కళైపులి థాను(Kalaipuli thanu) భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్(anirudh ravichander) సంగీతం అందిస్తున్నారు. వెట్రిమారన్ దర్శకత్వంలో వచ్చిన వడ చెన్నై యూనివర్స్(Vada chennai universe) లో ఈ సినిమా ఉంటుందని ఇప్పటికే క్లారిటీ రాగా, ఈ యూనివర్స్ లో మరిన్ని సినిమాలు రానున్నాయని తెలుస్తోంది. అటు వెట్రిమారన్, ఇటు శింబు ఇద్దరూ టాలెంట్ పరంగా ఉద్దండులే కావడంతో ఈ ప్రాజెక్టుపై భారీ అంచనాలున్నాయి.
ఇదిలా ఉంటే ఆరసన్ సినిమాలో శింబు సరసన హీరోయిన్ గా సౌత్ స్టార్ హీరోయిన్ సమంత(samantha)ను ఎంపిక చేశారని కోలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. సమంత తో మేకర్స్ ఇప్పటికే చర్చలు మొదలుపెట్టారని, ఆ డిస్కషన్స్ ఇంకా స్టార్టింగ్ స్టేజ్ లోనే ఉన్నాయని, అన్నీ కుదిరి ఈ కాంబినేషన్ వర్కవుట్ అయితే సమంత, శింబు కలిసి చేసే మొదటి ప్రాజెక్టు ఇదే కానుంది.