కెరీర్లోనే మొదటిసారి కొత్త క్యారెక్టర్లో…మరికాస్త విభిన్నంగా!
పిల్లా నువ్వులేని జీవితం, సుబ్రమణ్యం ఫర్ సేల్, సుప్రీమ్.. ఇలా వరసగా మూడు సూపర్‌హిట్స్‌తో ఒక్కసారిగా లైమ్‌లైట్‌లోకి వచ్చిన సాయిధరమ్‌తేజ్ ఆ తర్వాత చేసిన సినిమాలన్నీఆశించిన విజయాలు అందుకోలేదు. దీంతో కెరీర్‌పరంగా కాస్త వెనకపడ్డాడు. చిత్రలహరి, ప్రతిరోజూ పండగే చిత్రాలతో మళ్లీ హిట్ ట్రాక్‌లోకి వచ్చాడు. ప్రస్తుతం సుబ్బు దర్శకత్వంలో సోలో బ్రతుకే సో బెటర్ అనే ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేస్తున్నాడు.
లాక్డౌన్ కారణంగా ఈ సినిమా ఆగిపోయింది. అయితే ఈ సినిమా తర్వాత సాయిధరమ్ ఓ విభిన్నమైన కథతో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. వెన్నెల, ప్రస్థానం, ఆటోనగర్ సూర్య వంటి డిఫరెంట్ కథాంశాలతో సినిమాలు చేసి విలక్షణ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న దేవా కట్టా దర్శకత్వంలో సాయిధరమ్ సినిమా చేయబోతున్నాడు. ఐఎఎస్ ఆఫీసర్‌గా ఇప్పటివరకు చేయని ఓ కొత్త క్యారెక్టర్లో సాయిధరమ్ కనిపించబోతున్నాడు.
కథ ప్రకారం ఈ సినిమా షూటింగ్ అంతా నార్త్ ఇండియాలో చెయ్యాల్సి ఉంటుందట. అందుకే కరోనా కట్టడి తర్వాత ఈ సినిమా స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. ఐఎఎస్ ఆఫీసర్‌గా డిగ్నఫైడ్ లుక్‌లో కనిపించేందుకు ఫిజికల్ ఫిట్నెస్ కోసం ట్రై చేస్తున్నాడట. దేవా కట్టా చేసే సినిమాలు సొసైటీకి ఏదో ఒక మెసేజ్ అందించేవే ఉంటాయి. ఈ సినిమాలో హీరో ఐఎఎస్ ఆఫీసర్ కాబట్టి తప్పకుండా ఏదో ఒక బర్నింగ్ ఇష్యూతోనే కథ రెడీ చేసుకొని ఉంటాడు.













