ఆ పుకార్లను నమ్మొద్దు.. మేమే స్వయంగా ప్రకటిస్తాం
సాయిధరమ్‌తేజ్ కథానాయకుడిగా దేవా కట్ట దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనున్న విషయం తెలిసిందే. జె.బి.ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై జె.భగవాన్, జె.పుల్లారావు నిర్మిస్తున్నారు. ఇటీవలే లాంఛనంగా ప్రారంభించారు. ఈ సినిమాపై సోషల్ మీడియాలో వస్తోన్న పుకార్లపై నిర్మాతలు స్పందిస్తూ ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ ఈనెల 20 నుంచి మొదలుకావాల్సింది. కరోనా ప్రభావంతో షూటింగ్‌ను రద్దు చేసుకున్నాం. లాక్డౌన్ పూర్తయ్యాక సినిమా రెగ్యులర్ షూటింగ్ వివరాలు తెలియజేస్తాం. ఈ సినిమా తాలూకు తారాగణం, వారి పాత్రల గురించి సోషల్ మీడియాలో పలు రకాలైన వార్తలు వినిపిస్తున్నాయి. ఆ పుకార్లను నమ్మొద్దు. సినిమా అధికారిక వివరాల్ని మేమే స్వయంగా ప్రకటిస్తాం అన్నారు.













