ఒమిక్రాన్ వేరియంట్ భయంతో ఆర్ఆర్ఆర్, రాధే శ్యామ్ నిర్మాతలు!
మరో సారి విడుదల వాయిదా వేయనున్నారా?
కరోనా పుణ్యమా అని ఎప్పుడో విడుదలవుతాయని అనుకున్న ఆర్ ఆర్ ఆర్, రాధే శ్యామ్ చిత్రాలు వాయిదాల మీద వాయిదాలు పడుతూ వచ్చాయి. ఎట్టకేలకు కోవిడ్ సెకండ్ వేవ్ తర్వాత పరిస్థితులు బాగున్నాయని అనిపించడంతో ఆర్ ఆర్ ఆర్, రాధే శ్యామ్ మేకర్స్ తమ సినిమాలను విడుదలకు సంసిద్ధం చేశారు. కానీ.. ఇప్పుడు ఈ రెండు సినిమాలకు ఒమిక్రాన్ రూపంలో సమస్య వచ్చిందని మళ్లీ వాయిదా పడుతాయిని వార్తలు వినిపిస్తున్నాయి. టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా రేంజ్లో సంక్రాంతికి సందడి చేయనున్న చిత్రాల్లో ఆర్ ఆర్ ఆర్, రాధే శ్యామ్ సినిమాలు మాత్రమే వున్నాయి. ఈ రెండు సినిమాలు భారీ రేంజ్లో సినిమాలు విడుదలవుతున్న సంగతి తెలిసిందే. ఈ రెండు సినిమాలపై భారీ అంచనాలున్నాయి. ఈ రెండు చిత్రాల్లో ఆర్ ఆర్ ఆర్, జనవరి 7న విడుదలవుతుంది. అలాగే రాధే శ్యామ్ చిత్రం జనవరి 14న విడుదలవుతుందని ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. మరో వైపు ఇప్పటికే రెండు చిత్రాలకు సంబంధించి ప్రమోషన్స్ భారీ రేంజ్లో జరుగుతున్నాయి. అభిమానులు కూడా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
ఈ నేపథ్యంలో అందరికీ షాకింగ్లాంట వార్తలు కొన్ని నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. ఇంతకీ ఆ వార్తలు ఏమిటంటే? ఆర్ ఆర్ ఆర్, రాధే శ్యామ్ చిత్రాలు మళ్లీ వాయిదా పడబోతున్నాయని. ఆర్ ఆర్ ఆర్, రాధే శ్యామ్ చిత్రాల విడుదలకు అన్నీ పరిస్థితులు అనుకూలంగానే ఉన్నాయిగా, మరెందుకు వాయిదా పడుతాయనే సందేహం రావచ్చు. అసలు విషయం ఏంటంటే ఆర్ ఆర్ ఆర్, రాధే శ్యామ్ ఈ రెండు చిత్రాలు పాన్ ఇండియా మూవీస్ కావడం, ఇప్పటి వరకు దక్షిణాదిన వచ్చిన సమస్యలేమీ లేవు. కానీ.. అసలు సమస్యంతా బాలీవుడ్లోనే మొదలైంది. ఎందుకంటే శుక్రవారం మహారాష్ట్ర ప్రభుత్వం ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న కారణంగా రాత్రి 9 నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూను విధిస్తున్నట్లు అనౌన్స్ చేసింది. అంటే నైట్ షోస్ ఉండవు. అంతే కాకుండా మిగిలిన ఆటలను 50 శాతం ఆక్యుపెన్సీతో రన్ చేయాలని మహారాష్ట్ర ప్రభుత్వం తెలియజేసింది. ఇలాంటి పరిస్థితులుంటే భారీ బడ్జెట్తో రూపొందిన ఆర్ ఆర్ ఆర్, రాధే శ్యామ్ చిత్రాలకు వసూళ్ల పరంగా ఇబ్బందులు తలెత్తుతాయనడంలో సందేహం లేదు. దీంతో ఈ రెండు సినిమాలకు చెందిన మేకర్స్ వాయిదా వేస్తారనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. రెండు కరోనా వేవ్స్ కారణంగా సినిమా ఇండస్ట్రీలో చాలా ఇబ్బందులను ఫేస్ చేసింది. ఈ మధ్య కాలంలో అంతా సర్దుకుంటుందనిపించింది. దీంతో మేకర్స్ వారి సినిమాలను విడుదల చేయడానికి సన్నాహాలు చేసుకుంటూ వస్తున్నారు. అయితే మళ్లీ సినిమా ఇండస్ట్రీకి ఒమిక్రాన్ రూపంలో మళ్లీ ఇబ్బందులు తలెత్తాయి. మరి ఆర్ ఆర్ ఆర్, రాధే శ్యామ్ మేకర్స్, తమ సినిమాలు వాయిదా పడబోతున్నాయంటూ సోషల్ మీడియాలో బలంగా వినిపిస్తోన్న వార్త. కేవలం పది రోజుల వ్యవధి మాత్రమే వున్నా ఆర్ ఆర్ ఆర్, మరో 17 రోజుల వ్యవధి వున్నా రాధే శ్యామ్ నిర్మాతలు ఏం ప్లాన్ చేస్తారో వేచిచూడాల్సిందే!













