న్యూయార్క్ లో రేణు దేశాయ్
రేణు దేశాయ్ తన పిల్లలు ఆకీరా నందన్, ఆద్యాలతో కలిసి వెకేషన్‌ను న్యూయార్క్‌లో ఎంజాయ్ చేస్తున్నారు. ఈ విషయాన్ని రేణు స్వయంగా తన ఇన్‌స్టా గ్రాం ద్వారా తెలిపారు. ఈ వెకేషన్ సందర్భంగా న్యూయార్క్‌లో దిగిన పిక్స్‌ను కూడా ఆమె ఇన్‌స్టా గ్రాం ద్వారా షేర్ చేశారు. ఈరోజు ఆద్య, అకీరా నేను యాధృచ్చికంగా ఏ దుస్తులైతే ధరించామో అదే రంగు క్యాప్, షూస్ ధరించాం. (నా ఎత్తు 5.8 అడుగులు. 6.3 అడుగులు ఎత్తుతో అకీరా నాకంటే పొడవు ఉన్నాడు. కానీ నా లిటిల్ బేబీకి 14 ఏళ్లే) అంటూ ఇన్‌స్టా గ్రాంలో పోస్ట్ చేశారు. ఆద్య కుక్కపిల్లతో పిక్‌ను పోస్ట్ చేసిన రేణు ఆద్య ఆమె న్యూయార్క్ ఫ్రెండ్ పబ్‌లో అని పేర్కొన్నారు.













