Raja Saab: 24 గంటల్లో 59 మిలియన్ ఫ్లస్ వ్యూస్ తో “రాజా సాబ్” టీజర్

రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న “రాజా సాబ్” సినిమా టీజర్ డిజిటల్ వ్యూస్ లో రికార్డ్ లు క్రియేట్ చేస్తోంది. నిన్న రిలీజ్ చేసిన ఈ టీజర్ 24 గంటల్లోనే 59 మిలియన్ ఫ్లస్ వ్యూస్ తో నెం.1 ప్లేస్ లో యూట్యూబ్ లో ట్రెండ్ అవుతోంది. (Rebel Star Prabhas’ “Raja Saab” Teaser Creates Records with Over 59 Million Views in 24 Hours)టీజర్ కు వస్తున్న భారీ వ్యూస్ “రాజా సాబ్” సినిమా మీద ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ కు నిదర్శనంగా నిలుస్తున్నాయి. వింటేజ్ లుక్ లో ప్రభాస్ కనిపించిన తీరు, గ్రాండ్ మేకింగ్, హై క్వాలిటీ విజువల్ ఎఫెక్టులు “రాజా సాబ్” టీజర్ ను రిపీటెడ్ గా చూసేలా చేస్తున్నాయి.
డార్లింగ్ ప్రభాస్ ను ఎలా చూడాలని ప్రేక్షకులు వెయిట్ చేస్తున్నారో అలా చూపించారు టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి. డిసెంబర్ 5న “రాజా సాబ్” సాధించబోయే బాక్సాఫీస్ రికార్డులకు టీజర్ సక్సెస్ చిన్న శాంపిల్ గా నిలుస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ “రాజా సాబ్” చిత్రాన్ని ప్రెస్టీజియస్ గా నిర్మిస్తున్నారు. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ ఈ చిత్రంలో నాయికలుగా నటిస్తున్నారు.