ఆ విషయంలో మిస్టర్ బచ్చన్ ఫస్ట్
ఏదైనా సినిమాలకు ఓపెనింగ్స్ రావాలంటే దానికి ప్రమోషన్స్ ఎంతో కీలకం. స్టార్ హీరోలు సైతం ఈ ప్రమోషన్స్ లో పాల్గొంటూ సినిమాకు బజ్ పెంచుతున్నారు. అన్ని రకాల ఈవెంట్స్ లో పాల్గొంటూ మీడియాకు ఇంటర్వ్యూలిస్తూ ఆడియన్స్ కు థియేటర్లకు రప్పిస్తున్నారు. సినిమాకు ప్రమోషన్స్ ఎంత బాగా చేస్తే అంత బజ్ క్రియేట్ అవుతుంది.
ఈ ఆగస్ట్ 15న రిలీజ్ కాబోతున్న సినిమాల్లో ఒకటైన మిస్టర్ బచ్చన్ టీమ్ ఈ ప్రమోషన్స్ పైనే ఫోకస్ పెట్టింది. ఇప్పటికే రిలీజైన సాంగ్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. సితార్ సాంగ్ రిలీజ్ అయినప్పుడు హీరోయిన్ గురించి జరిగిన డిస్కషన్ అంతా ఇంతా కాదు. సెకండ్ సాంగ్ లో కూడా హీరోయినే హైలైట్ అయింది.
రీసెంట్ గా టీజర్ లాంచ్ కోసం పెట్టిన ప్రెస్ మీట్ హాట్ టాపిక్ అవగా, తర్వాత హరీష్ శంకర్ తన ఇంటర్వ్యూలతో సెగలు రేపుతున్నాడు. మరోవైపు హీరోయిన్ అందాలను హైలైట్ చేస్తూ కొత్త పోస్టర్లను రిలీజ్ చేస్తూనే ఉన్నారు. ఇక ఇప్పుడు రవితేజ కూడా ప్రమోషన్స్ లో జాయిన్ అయ్యాడు. రీసెంట్ గా మెట్రో ట్రైన్ లో రిలీజ్ చేసిన యాడ్ బాగా క్లిక్ అయింది. త్వరలోనే రవితేజ మీడియా ఇంటర్వ్యూల్లో కూడా పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి ఆగస్ట్ 15 చిత్రాల్లో ప్రమోషన్స్ విషయంలో మిస్టర్ బచ్చన్ టీమ్ ఉన్నంత ఫాస్ట్ గా ఏ టీమ్ లేదు.













