రవితేజ ఆ రిస్క్ చేస్తాడా?
ఫలితంతో సంబంధం లేకుండా మాస్ మహారాజా రవితేజ(Ravi Teja) వరుసపెట్టి సినిమాలు చేసుకుంటూ వెళ్తాడు. అందుకే ఆయన ఖాతాలో వరుసగా నాలుగు డిజాస్టర్లు పడ్డాయి. ధమాకా(Dhamaka) సినిమా తర్వాత రవితేజకు ఇప్పటివరకు మరో హిట్ పడలేదు. ధమాకా తర్వాత రవితేజ నుంచి వచ్చిన రావణాసుర(Ravanasura), టైగర్ నాగేశ్వరరావు(Tiger Nageswara rao), ఈగల్(Eagle) ఇలా ఒకదాన్ని మించి మరొకటి ఫ్లాపులయ్యాయి.
వీటి రిజల్ట్ ఎలా ఉన్నా ఓపెనింగ్స్ తో పాటూ కలెక్షన్స్ మాత్రం డీసెంట్ గానే దక్కాయి. కానీ మిస్టర్ బచ్చన్(Mr. Bachan) మాత్రం మరీ దారుణమైన ఫలితాన్నందుకుంది. దీంతో ఆయన నుంచి రానున్న ప్రతి సినిమా విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలని రవితేజ ఫ్యాన్స్ కోరుతున్నారు. దానికి అనుగుణంగానే భాను భోగవరపు(Bhanu Bhogavarapu) దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు రవితేజ.
ఈ సినిమా షూటింగ్ సగానికి పైగా పూర్తయ్యాక షూటింగ్ లో యాక్సిడెంట్ జరిగి రెండు నెలల పాటూ రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది. ఈ గ్యాప్ లో రవితేజ కొత్త సినిమాల కోసం కథలు విన్నట్లు సమాచారం. అందులో భాగంగానే తమిళ డైరెక్టర్ సి సుందర్(Sundar.C) చెప్పిన ఒక కథ రవితేజకు బాగా నచ్చిందని టాక్. ఒకప్పుడు సూపర్ హిట్ సినిమాలు తీసిన సుందర్ కొన్నేళ్లుగా హారర్ సినిమాలు మాత్రమే చేస్తున్నాడు. అవి కూడా ఏదో కమర్షియల్ గా వర్కవుట్ అవుతున్నాయి కానీ పెద్ద హిట్ మాత్రం ఏదీ లేదు. ఇలాంటి ట్రాక్ రికార్డున్న సుందర్, రవితేజకు ఎలాంటి కథ వినిపించాడనేది ఇప్పుడు అందరికీ ఆసక్తికరంగా మారింది. ఎలాంటి కథ చెప్పాడన్నది పక్కన పెడితే సుందర్ తో సినిమా చేయడం రవితేజకు ప్రస్తుతం రిస్కే.













