Raviteja: రవితేజ కెరీర్ లోనే మొదటిసారి అలాంటి టైటిల్

ఫలితాన్ని పట్టించుకోకుండా వరుస సినిమాలు చేసే మాస్ మహారాజా రవితేజ(Raviteja) ప్రస్తుతం భాను భోగవరపు(Bhanu Bhogavarapu) దర్శకత్వంలో మాస్ జాతర(Mass Jathara) సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ప్రస్తుతం మాస్ జాతర షూటింగ్ ను పూర్తి చేసే పనిలో ఉన్న రవితేజ తన తర్వాతి సినిమాను సెన్సిబుల్ డైరెక్టర్ కిషోర్ తిరుమల(Kishore Tirumala) దర్శకత్వంలో చేయనున్న సంగతి తెలిసిందే.
రవితేజ- కిషోర్ తిరుమల సినిమా జూన్ లో అధికారికంగా ప్రారంభమై ఆ తర్వాత నుంచి రెగ్యులర్ షూట్ కు వెళ్లనున్నట్టు తెలుస్తోంది. ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాలో రవితేజ క్యారెక్టర్ నెక్ట్స్ లెవెల్ లో ఉంటుందని చెప్తున్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమా టైటిల్ కు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిల్మ్ నగర్ సర్కిల్స్ లో వినిపిస్తోంది.
ఈ మూవీకి అనార్కలీ(Anarkali) అనే టైటిల్ ను దర్శకనిర్మాతలు పరిశీలిస్తున్నారట. అయితే రవితేజ మూవీ టైటిల్స్ ఎప్పుడూ చాలా క్యాచీగా ఉంటూనే మాస్ ను ఎట్రాక్ట్ చేసేలా ఉంటాయి. కానీ ఇప్పుడు రవితేజ సినిమాకు అనార్కలి లాంటి డిఫరెంట్ టైటిల్ ను పరిశీలించడం కొత్తగా ఉంది. కేతికా శర్మ(Kethika Sharma) హీరోయిన్ గా నటించనున్న ఈ సినిమాను నెక్ట్స్ ఇయర్ సంక్రాంతి టార్గెట్ గా షూటింగ్ ను పూర్తి చేయనున్నారట.