Raviteja: రవితేజ కిషోర్ తిరుమల సినిమా మూవీ అప్డేట్
ఈసారి సంక్రాంతికి భారీ పోటీ తప్పేలా లేదు. ఆల్రెడీ ఇప్పటికే పలు పెద్ద సినిమాలు రిలీజ్ కు ఉండగా ఇప్పుడు మరో సినిమా సంక్రాంతి రిలీజ్ కు సిద్ధమైంది. వచ్చే ఏడాది సంక్రాంతికి చిరంజీవి(chiranjeevi)- అనిల్ రావిపూడి(anil ravipudi) సినిమాతో పాటూ నవీన్ పోలిశెట్టి(Naveen polishetty) అనగనగా ఒక రాజు(anaganaga oka raju) కూడా పోటీలో ఉంది. ఆ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఆఖరి దశకు చేరుకుంది.
డిసెంబర్ రిలీజ్ అని చెప్తున్న రాజా సాబ్(raja saab) కూడా పండగ బరిలోకే తీసుకురావాలని మేకర్స్ అనుకుంటున్నారు. దాంతో పాటూ అఖండ2(akhanda2) ఒకవేళ ఇప్పుడు వాయిదా పడితే సంక్రాంతికే వస్తుందంటున్నారు. అయితే ఇప్పుడు వీటితో పాటూ రవితేజ(ravi teja) హీరోగా కిషోర్ తిరుమల(Kishore tirumala) దర్శకత్వంలో వస్తోన్న సినిమా కూడా పండగకి రాబోతున్నట్టు చిత్ర యూనిట్ సభ్యులు చెప్తున్నారు.
ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ మొదలై శరవేగంగా జరుగుతుంది. ఆల్రెడీ ఓ షెడ్యూల్ కూడా పూర్తి చేశారు. అయితే ఈ మూవీకి సంబంధించి ఇప్పుడో అప్డేట్ తెలుస్తోంది. అక్టోబర్ లో ఈ సినిమాకు సంబంధించిన ఓ ఫారిన్ షెడ్యూల్ ను మేకర్స్ ప్లాన్ చేశారని, ఆ షెడ్యూల్ ను స్పెయిన్ లో చేసే అవకాశముందని అంటున్నారు. కుదిరినంత త్వరగా షూటింగ్ ను పూర్తి చేసి సినిమాను సంక్రాంతి బరిలో నిలపాలని రవితేజ చూస్తున్నాడట. అదే నిజమైతే రెండేళ్ల కిందట వాల్తేరు వీరయ్య(waltair veerayya)లో చిరూ(chiru) తో కలిసి పండగకు ప్రేక్షకుల్ని పలకరించిన రవితేజ, ఇప్పుడు అదే చిరూతో పోటీకి రెడీ అవుతున్నట్టే.







