Raviteja: నెగిటివిటీకి చాలా దూరం

హిట్టూ ఫ్లాపుతో సంబంధం లేకుండా సినిమాలు చేసే మాస్ మహారాజా రవితేజ(raviteja) హీరోగా నటించిన తాజా చిత్రం మాస్ జాతర(mass jathara). శ్రీలీల(Sree Leela) ఈ సినిమాలో హీరోయిన్ గా నటించగా, భాను భోగవరపు(Bhanu Bhogavarapu) ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. రవితేజ, శ్రీలీల కలిసి చేస్తున్న రెండో సినిమా ఇది. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ధమాకా(Dhamaka) మంచి హిట్ అవడంతో మాస్ జాతరపై మంచి హైప్ నెలకొంది.
వాస్తవానికి మాస్ జాతర మూవీ జులై లోనే రిలీజ్ కావాల్సింది కానీ షూటింగ్ ఆలస్యం అవడం వల్ల సినిమా వాయిదా పడి అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ లో భాగంగా చిత్ర యూనిట్ ఓ ఇంటర్య్వూలో పాల్గొనగా, అందులో రవితేజ కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించాడు.
తన చిన్నప్పుడు జాతరలకు వెళ్లే వాడినని, చాలా ఎంజాయ్ చేసేవాడినని చెప్పిన రవితేజ, భీమవరం కోడిపందాలు, రికార్డింగ్ డ్యాన్సులకు వెళ్లాలనిపిస్తుందని, ఇప్పుడు వాటన్నింటినీ చాలా మిస్ అవుతున్నానని చెప్పుకొచ్చాడు రవితేజ. తనకు టైమ్ దొరికినప్పుడు అప్పుడప్పుడు ఇన్‌స్టాలో రీల్స్ చూస్తానని చెప్పిన మాస్ మహారాజా ట్విట్టర్ జోలికి మాత్రం వెళ్లనని, అక్కడ నెగిటివ్ బ్యాచ్ ఉంటుందని తాను నెగిటివిటీకి దూరంగా ఉంటానని తెలిపాడు.
https://x.com/idlebraindotcom/status/1975478339822625164?s=12&t=WY6ojOJj3zQGHgXs84FgLA