Raviteja: తమన్ ఎప్పుడూ ఫ్లాపవలేదు

టాలీవుడ్ లో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్లలో ప్రస్తుతం తమన్(Thaman) స్టార్ రేంజ్ లో ఉన్నాడు. వరుస సినిమాలతో హిట్లు అందుకుంటూ తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో స్పీకర్లు బద్దలు కొడుతున్న తమన్, రీసెంట్ గా ఓజి(OG) మూవీతో నెక్ట్స్ లెవెల్ గుర్తింపును తెచ్చుకున్నాడు. ఓజి సాంగ్స్, బీజీఎంతో తమన్ అందుకున్న అప్లాజ్ అంతా ఇంతా కాదు. ఇదిలా ఉంటే తమన్ గురించి రీసెంట్ గా రవితేజ(Raviteja) కామెంట్స్ చేశారు.
రవితేజకు, తమన్ తో మంచి బాండింగే ఉంది. రవితేజ నటించిన ఎన్నో సినిమాలకు తమన్ మ్యూజిక్ డైరెక్టర్ గా వర్క్ చేశాడు. అంతేకాదు, వారిద్దరి కాంబినేషన్ లో వచ్చిన పలు పాటలు మ్యూజికల్ హిట్స్ గా కూడా నిలిచాయి. ఈ నేపథ్యంలోనే రీసెంట్ గా మాస్ జాతర ప్రమోషన్స్ లో భాగంగా సిద్ధు జొన్నలగడ్డ(Siddhu jonnalagadda)తో చేసిన చిట్ చాట్ లో తమన్(thaman) గురించి మాట్లాడాడు రవితేజ.
తమన్ సూపర్ సాంగ్స్ ఇస్తాడని, తనతో చాలా సినిమాలకు వర్క్ చేశాడని, తన సినిమాలు హిట్టైనా ఫ్లాపైనా తమన్ మాత్రం ఎప్పుడూ ఫ్లాపవలేదని, ఒకట్రెండు తప్ప అన్ని సాంగ్స్ హిట్టేని, కిక్(kick), బలుపు(balupu) ఇంకా చాలా సినిమాల్ని తమన్ మ్యూజికల్ హిట్స్ చేశాడని, ఈ మధ్య కాస్త గ్యాప్ వచ్చిందని, త్వరలోనే మళ్లీ కలిసి వర్క్ చేస్తానని చెప్పాడు రవితేజ. తమన్ గురించి రవితేజ చేసిన ఆ కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.