Raviteja: సిద్ధుకి ఆ సినిమాను రీమేక్ చేయమని చెప్పిన రవితేజ

టాలీవుడ్ స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ(Siddhu Jonnalagadda) హీరోగా నటించిన తెలుసు కదా(Telusu Kadha) మూవీ దీపావళి సందర్భంగా అక్టోబర్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. రవితేజ(Raviteja) నటించిన మాస్ జాతర(Mass Jathara) సినిమా కూడా ఇదే నెల 31వ తేదీన రిలీజ్ కానున్న సందర్భంగా ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ సందర్భంగా ఇద్దరు హీరోలు కలిసి సరదాగా సినిమా విశేషాలు మాట్లాడుకున్నారు.
చిట్ చాట్ లో భాగంగా, బయోపిక్ ప్రస్తావన రాగా, కృష్ణ అండ్ హిజ్ లీల(Krishna And His Leela) మూవీ చేశాక మీ బయోపిక్ చేయాలని రెండు నెలలు ట్రై చేశానని, కానీ కుదరలేదని, మీరు ఓపెన్ అయితే ఫ్యూచర్ లో చేస్తానని సిద్ధు(Siddhu) చెప్పగా, బయోపిక్ అంటే అందరూ పాజిటివ్ విషయాలే చూపిస్తారని, అలా కాకుండా అందులో నెగిటివ్స్ కూడా ఉండాలని రవితేజ అన్నాడు.
మీరు కూర్చుని మనసులో ఉన్న మాటల్ని చెప్తే మేం ట్రై చేస్తామని సిద్ధు చెప్పాడు. అయితే ఆ సంభాషణ ఆఖరిలో నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమొరీస్(Naa Autograph Sweet Memories) సినిమాను రీమేక్ చేయమని సిద్ధూకి చెప్పాడు రవితేజ. నా ఆటోగ్రాఫ్ ఎలాంటి కల్ట్ క్లాసిక్ సినిమానో ప్రత్యేకంగా చెప్పే పన్లేదు. సిద్ధు స్టైల్, ఎమోషనల్ డెప్త్ ఆ సినిమాకు సరిగ్గా సరిపోతాయని చెప్పగా, దానికి సిద్ధూ అలాంటి టైమ్‌లెస్ స్టోరీని చేయమని తనకు చెప్పడం నిజంగా గౌరవంగా ఉందని చెప్పాడు.